యోగా దినోత్సవం సందర్బంగా యోగా సాధకులకు యోగా మాట్స్ వితరణ చేసిన బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, June 21, 2022

యోగా దినోత్సవం సందర్బంగా యోగా సాధకులకు యోగా మాట్స్ వితరణ చేసిన బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్

  యోగా దినోత్సవం సందర్బంగా యోగా సాధకులకు యోగా మాట్స్ వితరణ చేసిన బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్  


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

   నేడు "8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం" సందర్బంగా శ్రీకాళహస్తి పట్టణంలోని  శ్రీ శుకబ్రహ్మాశ్రమం నందు పూజ్య శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో జరిగిన "యోగా సాధన" కార్యక్రమంలో శ్రీ కోలా ఆనంద్ గారు, పట్టణ బిజెపి నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది.

  కార్యక్రమం అనంతరం యోగా సాధకులకు తేజో భారత్ సంస్థ" తరపున "యోగా మాట్స్" ను ఆశ్రమ పీఠాధిపతులకు అందజేసి, పూజ్య గురువులను, మరియు యోగా గురువులను కోలా ఆనంద్ గారు ఘనంగా సత్కారించడం జరిగింది.

  ఈ సందర్బంగా కోలా గారు మాట్లాడుతూ...ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనశైలిని అవలంబిస్తున్న నేటి ప్రపంచానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నాయకత్వంలోని 🇮🇳భారత్ ఇచ్చిన అతి విలువైన కానుక యోగా!!  ప్రతి వ్యక్తి ,ప్రతి కుటుంబం వారి నిత్యజీవితంలో యోగా చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇంతటి మంచి అవకాశాన్ని నాకు కల్పించిన పూజ్య గురువులకు నా పాదాభివందనము అని తెలియజేశారు..

  ఈ కార్యక్రమం నందు పట్టణ బిజెపి నాయకులు గరికపాటి రమేష్ బాబు, పుణ్యం ఢిల్లీ, కోనేటి అయ్యప్ప, కుప్పా ప్రసాద్ మరియు పట్టణ ప్రముఖులు, యోగా సాధకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad