బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీ కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా "శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ " వర్ధంతి వేడుకలు
నేడు శ్రీకాళహస్తి పట్టణంలో, దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి వేడుకలను, పట్టణంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద, పట్టణ బిజెపి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు..
కోలా ఆనంద్ పై కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులు తెలియజేశారు..
ఈ సందర్బంగా కోలా ఆనంద్ గారు మాట్లాడుతూ..
ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు మరియు భారతీయ జనసంఘ్ స్టాపకులు "డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు", భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు ముఖర్జీ గారు. వారి జీవితంలో ప్రతిక్షణం, శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి. జనసంఘ్ ను నేను కాలరాచి పారేస్తాను" అన్న నెహ్రూ బెదిరింపును ప్రస్తావించి " ఈ కాలరాచే మనస్తత్వాన్ని నేను కాలరాచి తీరుతాను" అని శ్యాంప్రసాద్ గారు సవాల్ విసిరారు. భావి రాజకీయ సంగ్రామానికి ఈ సవాలు ఆనాడు ఒక సంకేతం అయింది,1953 మే 12న శ్రీనగర్ జైలుకు చేర్చి, అక్కడి నుండి దాల్ సరస్సు సమీపంలోని కొండవాలులో ఉన్న ఒక అతిథి గృహానికి శ్యాంప్రసాద్ ను తరలించిన నాటి నుంచి జూన్ 23న ఆయన అంతిమ శ్వాస విడిచే వరకూ గడిచిన భారత రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైనవిగా చెప్పక తప్పదు.
శ్యాంప్రసాద్ హఠాన్మరణం అనేక అనుమానాలకు దారితీసింది. కాశ్మీర్ భూభాగంపై తన అరెస్టును గురించి వ్యాఖ్యానిస్తూ 'ఇది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన కుట్ర' అన్న శ్యాంప్రసాద్ వ్యాఖ్య దగ్గరనుంచి మొదలుపెట్టి ప్రభుత్వ విచారణకు నెహ్రూ తిరస్కరించడం వరకు అనేక అంశాలు శ్యాంప్రసాద్ మరణం సహజమైనది కాదని, ఆయనను వైద్యపరంగా చంపబడ్డారని(Medical Murder) అనుమానాన్ని దృఢ పరిచాయి.
శ్యాంప్రసాద్ మరణం జాతికి ఆశనిపాతం అయుంది. ఆ వార్త విని జాతీయ యావత్తు క్షణం నిర్ఘాంతపోయింది. మరుక్షణం తల్లడిల్లిపోయింది. శోకసముద్రంలో మునిగిపోయింది.దేశమంతటా సంతాప ప్రకటన ప్రారంభమైంది.
మాతృభూమి సేవలో నిజమైన యోధుడిగా శ్యాంప్రసాద్ కాశ్మీర్ విలీనం కోసం సాగిన పోరాటంలో అగ్రభాగాన నిలిచి బలిదానం చేశారు".
శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమే అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ , నరేంద్ర మోడీ ప్రభుత్వం 370 వ అధికరణను తొలగించి, వారికి ఘనమైన నివాళి అర్పించింది....
అని వారు తెలియజేశారు.
పై కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, పట్టణ బిజెపి నాయకులు వజ్రం కిషోర్, శ్రీమతి ప్రజ్ఞశ్రీ, చిలకా రంగయ్య, గరికపాటి రమేష్ బాబు, సొట్ట సుకుమార్, కిట్టు, కన్నా వెంకటేశ్వర్లు, యం. చెంగాలరాయుల రెడ్డి, మద్దు వాసు యాదవ్,యల్. గోపాల్, పుణ్యం ఢిల్లీ, కొండేటి గోపాల్, మంచినీళ్ల గుంట రాజా, గోపాల్,భరత్, పళని,గాలి రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment