శ్రీ సామ్రాట్ అక్కలకోట మహారాజ్ వారి పాదుకలు శ్రీకాళహస్తి పట్టణంలో - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, June 7, 2022

శ్రీ సామ్రాట్ అక్కలకోట మహారాజ్ వారి పాదుకలు శ్రీకాళహస్తి పట్టణంలో

 శ్రీ సామ్రాట్ అక్కలకోట మహారాజ్ వారి పాదుకలు దర్శనం మహాభాగ్యం


స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి  :

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని లాయర్ రాజేశ్వరావు గారి ఇంటికి శ్రీ సామ్రాట్ అక్కలకోట మహారాజ్ వారి పాదుకలు భక్తుల దర్శనం నిమిత్తం వచ్చింది. అశేష భక్తులు ఈ పాదుకలను దర్శనం చేసుకొని మహా భాగ్యం పొందారు.

భక్తులు మాట్లాడుతూ.... స్వామివారి పాదుకలు దర్శించడం మహాభాగ్యం, అవకాశం అందరికి రాదు అలాగే దత్తాత్రేయుని అవతారం షిరిడి సాయిబాబా ముందు అవతారంగా శ్రీ సామ్రాట్ అక్కలకోట మహారాజ్ గా చెప్పుకుంటారు. మీరు అన్ని ప్రదేశాల్లో ప్రయాణిస్తుండగా ఆక్కుల కోట  లో ఆగిపోతారు. అక్కడ చోళప్ప అనే భక్తుడు ఇంట్లో ఉండి వారి మహిమలు అనేక భక్తులకు చూపించారు. అనంతరం తన దత్తత్రేయ  అవతారమే అని తెలిపి, ఆయన ఏ కార్యం అయితే నిర్వహించాలని వచ్చారో, ఆ కార్యం  సంపూర్ణంగా నిర్వర్తించి, తర్వాత తరంలో షిరిడి లో సాయి బాబా వస్తారు అని తెలిపారు. అలాగే ఆయన ఎక్కడ నివసించునాడో, అక్కలకోట లో జీవసమాధి అయి ,  ఇప్పటికి కూడా అశేష భక్తులకు దర్శనమిస్తున్నారు అని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad