భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్ డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్‌ను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం - మంత్రి రోజా
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్
ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రశంసించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
బదిరుల ఒలంపిక్ క్రీడల్లో (డెఫిలింపిక్స్–2022) కర్నూలుకు చెందిన టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై జాఫ్రిన్‌ను ప్రశంసించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
షేక్ జాఫ్రిన్ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశాలు
శ్రీకాంత్, జాఫ్రిన్‌ను ఘనంగా సన్మానించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, ప్రభుత్వం తరపున వారికవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు సూచించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
No comments:
Post a Comment