శ్రీశ్రీశ్రీ పట్టపుట్టాలమ్మకు సారె ను సమర్పించిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రేణిగుంట మండలం, కరకంబాడి నందు వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ కట్టపుట్టాలమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవములకు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి మొట్టమొదటిసారి అమ్మవారికి వస్త్రాలు, పసుపు కుంకుమ సుఘంద ద్రవ్యాలు, ఫలపుష్ప మాలలతో సారెను సమర్పించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి విచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారి సారథ్యంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అర్చకుల వేదమంత్రాలతో అమ్మవారికి సారెను సమర్పించారు. తదనంతరం ఆలయ పూజారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారికి సారెను సమర్పించడం ఎంతో సంతోషాదయాకమని, అమ్మవారి దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా ప్రతి యేటా దేవస్థానం తరుపున అమ్మవార్ల జాతర్లకు సారెలను సమర్పించాలని ఛైర్మన్ కు మరియు ఆలయ అధికారులకు తెలియజేశారు.
తదనంతరం చైర్మన్ మాట్లాడుతూ గతంలో శ్రీకాళహస్తి దేవస్థానం తరపున కాళహస్తి పట్నంలో నిర్వహించే ఏడు గంగమ్మలకు మాత్రమే సారెను ఇచ్చే సంప్రదాయం ఉండేదని కానీ ఈ ఏడాది నుండి అగ్రహారం, పానగళ్లు, బంగారమ్మ కాలనీ గంగమ్మలకు అందిరికి దేవస్థానం తరపున సారెలు ఇవ్వడం జరిగింది.అదే విధంగానే ఎమ్మెల్యే సూచనలతో ఈ ప్రాంతంలో కూడా అమ్మవార్లకు సారెను దేవస్థానం తరపున ఇవ్వడం ఈ ప్రాంత వాసులు యొక్క అదృష్టం అని, అమ్మవారి దీవెనలతో పాటూ తల్లి జ్ఞాన ప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వరుని యొక్క చల్లని దీవేనలతో ఈ ప్రాంతం అంతా శాశ్యశ్యామలంగా ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో పాలకమండలి సభ్యులు మున్నా రాయల్, జయశ్యామ్ రాయల్, ఆలయ అర్చకులు అర్ధగిరి, కకరుణాకర్, రాకేష్, ఆలయ అధికారులు అయ్యన్న, హరి, రజిని మరియు గ్రామ వాస్తవ్యులు ఎంపీపీ హరి ప్రసాద్, రమేష్, పార్వతమ్మ మరియు సెన్నేరు కుప్పం శేఖర్, బాల గౌడ్, తేజ తదితరులు పాల్గొ
No comments:
Post a Comment