ఆలాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి జానపద వృత్తి కళాకారుల సంఘం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
ఆగస్టు 1వ తేదీ నుండి నాలుగు రోజుల పాటు జరిగే ఆలాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జానపద వృత్తి కళాకారుల సంఘం విజయోత్సవ సభలో రాష్ట్ర నాయకుల పిలుపు........ ఈరోజు జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు జి వేణు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నందు విజయోత్సవ ర్యాలీ జరిగింది అనంతరం నూతన తిరుపతి జిల్లా స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు అఖండ హరినామ సంకీర్తన వేదికలో ప్రోగ్రాములు ప్రారంభిస్తున్నట్లు తెలియజేయుటకు సంతోషిస్తున్నాము అన్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నాలుగు రోజులపాటు తిరుపతి మహతి ఆడిటోరియం నందు అన్నమయ్యకు నీరాజనం పేరుతో ఆలాపన కార్యక్రమం పాటల పండుగను నిర్వహించనున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కళాకారుడు తమ కళా రూపాలతో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆలాపన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారని తెలియజేశారు. సినీ ప్రముఖులు నటులు గాయకులు రచయితలు కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఆశీర్వాద ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు గెడి వేణు కాంజేరి సెల్వ రాజు మాట్లాడుతూ మన సంఘం దేవుడి దయతో స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు టీటీడీ ఈవో గారికి చల్లని దీవెనలతో విస్తారంగా నిజాయితీగా పనిచేస్తూ మన జానపద కళలను అభివృద్ధి చేసి భావితరాలకు అందించడానికి మేము చేసే కృషి లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం నూతన తిరుపతి జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షులుగా గెడి వేణు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంజేరి సెల్వ రాజు ఉపాధ్యక్షులుగా జయరామయ్య .మునెయ్య. సహాయ కార్యదర్శిగా శ్రీనివాసులు. కోశాధికారిగా పి.విశ్వనాథ్ జిల్లా కమిటీ సభ్యులుగా రామచంద్రయ్య. రాణెమ్మ. సుబ్రహ్మణ్యం. సుజాత. యం. చెన్నయ్య యన్. సిద్దయ్య ఎం కృష్ణయ్య. లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు బృందం లీడర్లు కళాకారులు నాయకులు దాదాపు 300కు పైగా పాల్గొన్నారు. ధన్యవాదాలతో... బంగారం మురళి .రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానపద కళాకారుల సంఘం.
No comments:
Post a Comment