మహిళల ఓట్లతో గెలిచి మహిళల్ని మోసం చేస్తున్న జగన్ రెడ్డి :చక్రాల ఉషా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఒంటరిమహిళకితూట్లుపెట్టడం,
అమ్మఒడికిచిల్లిపెట్టడం,
దుల్హన్పథకాన్ని_పాతిపెట్టడం
మోసపురెడ్డి జగన్మోహన్రెడ్డీకే చెల్లింది
మహిళల ఓట్లతో గెలిచి మహిళల్ని మోసం చేస్తున్న జగన్ రెడ్డి అంటూ మహిళలు ధ్వజ మెత్తారు
రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పిలుపు మేర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేర తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు
ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి,రాష్ట్ర మహిళ కార్యదర్శి గుండాల లీలావతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భార్గవమ్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శి తుపాకుల కన్నెమ్మ, పట్టణ అధ్యక్షకార్యదర్శి సుమతి, దుర్గమ్మ, మాజీ కౌన్సిలర్లు అనిత, విజయలక్ష్మి, సుజాత తదితరులు....
తెలుగుదేశం పార్టీ హయాంలో ఒంటరి మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలలో 30 సంవత్సరాలు పట్టణాల్లో 35 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ ను చంద్రబాబు అందిస్తే నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటికి తిలోదకాలిచ్చి వారికి ఆసరా లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమంటూ టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చక్రాల ఉష మాట్లాడుతూ ఎన్నికల ముందు వరకు అక్కాచెల్లెమ్మలకు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భస్మాసుర హస్తం పెడుతూ మహిళలను నిలువునా ముంచిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు ముందు 45 ఏళ్లకే మహిళలకు పింఛన్ ఇస్తానని ఊరూరా తిరిగి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక మాటమార్చి మహిళలకు శతగోపం పెట్టారని విమర్శించారు. ఎవరి మీద ఆధారపడకుండా జీవించేందుకు ఉపయోగపడే ఒంటరి మహిళ పెన్షన్ పథకం లో వయో పరిమితి 50 ఏళ్లకు పెంచడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
అమ్మ ఒడి, చేయూత, భరోసా, రైతు భరోసా ఇలా రోజుకో పథకం పేరుతో హడావుడి చేస్తూ పత్రికలకు భారీ ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేస్తూ లక్షలాది మంది లబ్ధిదారులను సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారని అన్నారు. ఒంటరి మహిళ వయస్సు 50 సంవత్సరాల కు పెంచి అర్హత కలిగిన మహిళలను ఆ పథకానికి దూరం చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనలతో ఒంటరి మహిళలు ఆసరా కోల్పోతున్నారని ఇది మంచి పద్ధతి కాదని భవిష్యత్తులో ఈ ప్రభుత్వం నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసి పోతుందని హితవు పలికారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో ఒంటరి మహిళ పెన్షన్ పొందుతున్న లక్షన్నర మంది లో పది శాతానికి మించి వచ్చే నెల నుండి పెన్షన్ అందుకునే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుల్హన్ పథకం ద్వారా ఆనాడు 50000 నిరుపేద మహిళలకు పెళ్లి కానుక ఇస్తున్నా చంద్రబాబునాయుడు గారు పథకాన్ని లక్ష రూపాయలు పెంచి ఇస్తానని అబద్ధపు ప్రచారాలు చేసి ఈ రోజు అందరి కళ్లలో దుమ్ముకొట్టాడని లక్షల మంది మహిళలు నష్టపోతున్నారని నమ్మి ఓట్లేసిన మహిళలకి అడ్డంగా మోసం చేసిన జగన్ రెడ్డి ఆ మహిళలే కంకణం కొట్టుకొని జగన్ రెడ్డికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు
No comments:
Post a Comment