"బొజ్జల బృందమ్మ' ను పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రి"
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలందించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పూర్తివంతమైన నాయకత్వం సదా ఆచరణీయం అని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి పనబాక లక్ష్మి కొనియాడారు.
బొజ్జల కుటుంబీకుల స్వగ్రామమైన శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామంలో స్వర్గీయ గోపాలకృష్ణా రెడ్డి సతీమణి శ్రీమతి బొజ్జల బృందమ్మ గారిని పనబాక లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దుర్భేద్యమైన కంచు కోటగా మలిచి, చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన బొజ్జల కుటుంబం యొక్క సేవలు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఎంతో అవసరం అని, ఈ క్రమంలో శ్రీమతి బృందమ్మ గారి మార్గనిర్దేశకంలో తెలుగుదేశం పార్టీ ప్రతీ కార్యకర్త నడుస్తూ రాబోయే ఎన్నికలలో గోపాలకృష్ణా రెడ్డి గారి వారసుడు సుధీర్ బాబు గారిని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నుకొని నియోజకవర్గాన్ని రాబందుల కబంద హస్తాల నుండి కాపాడుకోవాలని పనబాక లక్ష్మి గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి దశరధాచారి, తెలుగు మహిళ, తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు చక్రాల ఉష, తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి, రంగినేని చెంచయ్య నాయుడు, మనోహరాచారి, బలరాం యాదవ్, బి.జె.ప్రసాద్, చింతగింజల సునీల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment