డీజీపీకి చంద్రబాబు లేఖ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Saturday, June 25, 2022

demo-image

డీజీపీకి చంద్రబాబు లేఖ

poornam%20copy

 చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు...డీజీపీకి చంద్రబాబు లేఖ

WhatsApp%20Image%202022-06-25%20at%2011.39.43%20AM

అమరావతి: 

చిత్తూరు మాజీ మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారన్నారు. బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు.

''ఈ కేసులో కీలక సాక్షి అయిన సతీష్‌ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపైనా దాడి చేశారు. పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. అడ్డుకున్న మాజీ మేయర్‌ హేమలతతో దారుణంగా వ్యవహరించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ నిలబడినందుకు హేమలతపై పోలీసు జీపు ఎక్కించారు. తీవ్ర గాయాలతో హేమలత ఆస్పత్రి పాలయ్యారు. పోలీసు జీపు డ్రైవర్‌పై దాడి జరిగిందని ఆయన్నూ ఆస్పత్రిలో చేర్చారు. పూర్ణపై అక్రమ కేసు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. హేమలతపై దారుణంగా జీపు ఎక్కించి, బెదిరింపులకు పాల్పడుతున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల చర్యలు ఉండాలి'' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages