గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అంగన్వాడీ సేవలు భేష్ - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
స్వర్ణముఖిన్యూస్ శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిలోని అక్కుర్తి గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు గర్భవతి వేడుక కార్యక్రమాన్ని,బాలింతలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి చేతులమీదుగా జరిపించారు, కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు-నేడు మన అంగన్వాడీ కార్యక్రమం లో భాగంగా ఆ పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సుల పాఠ్యపుస్తకాలను బోధనా సామగ్రిని ప్రదర్శించారు అనంతరం గర్భవతులకు బాలింతలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ లను అందజేశారు అంగన్వాడీ కేంద్రాలలో అమలు చేస్తున్న వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం గురించి వివరించారు లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రంలో పేర్లను
నమోదు చేసుకుని వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కు సంబంధించిన పోషకాహారం,ఆరోగ్య సలహాలు, వైద్య పరీక్షల సలహాలు ,సుఖప్రసవ సూచనలు,అంగన్వాడీ కేంద్రాలలో ఉచ్చితంగా పొందవచ్చు అన్నారు, అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న ఈ సంపూర్ణ పోషణ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని తెలియజేశారు
ఈ కార్యక్రమo లో CDPO శాంతిదుర్గ,ఐ సి డి స్ సూపర్ వైసర్ రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు రామతులసి, సుబ్బలక్ష్మి లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment