రేణిగుంట రైల్వే కళ్యాణమండపం నందు లోకో పైలట్ లకు సేఫ్టీ సెమినార్స్
స్వర్ణముఖి న్యూస్ ,రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే జంక్షన్ సమీపంలోగల రైల్వే కళ్యాణమండపం నందు లోకో పైలెట్ గూర్చి సేఫ్టీ సెమినార్ నిర్వహించారు. ఈ సేఫ్టీ సెమినార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
పి సి ఎస్ ఒ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి ఏ డి ఆర్ ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ సంవత్సరంలో రెండుసార్లు సేఫ్టీ సెమినార్స్ నిర్వహిస్తున్నామని, ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నిటినీ వివరించడం జరిగిందని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రైల్వే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సేఫ్టీ సెమినార్ కార్యక్రమంలో బి.యమ్.భాష మరియు టీం వేసిన ప్రత్యేక స్కిట్టు లోకో పైలట్ మరియు అధికారులను ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలోరవీంద్రనాథ్ రెడ్డి పి సి ఎస్ ఓ, సూర్యనారాయణ ఏ డి ఆర్ ఎం, విష్ణు కాంత్ సి ఈ ఈ, మల్లికార్జున్ సీనియర్ డి ఈ ఈ లోకో పైలట్ లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment