తారక్ నాథ్ వర్ధంతి యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ మరియు ఎన్ సి బి యు జనరల్ సెక్రటరీ స్వర్గీయ తారక్ నాథ్ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కార్యాలయంలో వర్ధంతి నిర్వహించారు. యూనియన్ నాయకులు పి సి మునయ్య ఆధ్వర్యంలో తార్నాక నాడ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్ప మాలలు వేసి పూజలు జరిపి ఘన నివాళులర్పించారు. తారక్నాథ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.. యూనియన్ నాయకులు పి సి మునయ్య, బ్రాంచ్ మేనేజర్ స్వప్న మాట్లాడుతూ తారక్ నాథ్ యూనియన్ కోసం ఎనలేని సేవ చేశారని, చివరికి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని ఆయన సేవల అసమానం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ నాయకులు చైతన్య లావణ్య గోపీనాథ్, పూర్ణ, బాల, వెంకటేష్, అరుణ్, రఫీ, జయ చంద్ర రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment