శ్రీ కావమ్మ మారయ్య కుంభాభిషేక మహోత్సవంలో భరతనాట్యంలో భక్తులను ఆకట్టుకున్న రాగ శ్రీ,.
శ్రీకాళహస్తి గాంధీ వీధి లోని కావమ్మ వీధి లో కావమ్మ శ్రీ రామ మందిరం కుంభాభిషేకం మహోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన పూర్ణిమా మధు కుమార్ కుమార్తె చిన్నారి రాగ శ్రీ భరతనాట్యం నృత్య ప్రదర్శనతో అలరింప చేశారు. అలాగే కావ్యాసింగ్ బృందం కూచిపూడి భరత నాట్య నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అనంతరం కావమ్మ విశిష్టతను తెలియజేసే విధంగా కావమ్మ కథ ను బుర్ర కథ రూపంలో తెలియజేశారు. కళాకారులు కావమ్మ కథను రాగయుక్తంగా ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఆమె ప్రాతివత్యం మహత్యం ఆమె దేవుడు గా మారిన ఘటనలు వివరించారు. భక్తులను బుర్ర కథ గానం ఎంతో ఆకట్టుకుంది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు రు ఈ కార్యక్రమంలో లో ఆలయ కమిటీ సభ్యులు రవికుమార్, నెల్లూరు జయ ప్రకాష్ ,నెల్లూరు కన్నయ్య, నెల్లూరుజగదీష్, కాట్రపల్లి చంద్రశేఖర్, నెల్లూరు గాంధీ, కాట్రపల్లి సురేష్, సీతారాం కిషోర్, కాట్రపల్లి మోహన కృష్ణ, నెల్లూరు పురుషోత్తం, నెల్లూరు శ్రీనివాసులు, పనపాకం శరవణ, నెల్లూరు శివ ప్రసాద్ విద్యాసాగర్, తదితరులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
No comments:
Post a Comment