పానగల్ గంగమ్మకు శివయ్య సారె సమర్పించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్శ్రీ ,శ్రీ కాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం పానగల్ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు సారె సమర్పించారు.మంగళవారం పొన్నాలమ్మ తల్లి దేవాలయం వద్ద నుండి మంగళ వాయిద్యాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ముందుగా గంగమ్మ జాతర కమిటీ సభ్యులు బుజ్జి రెడ్డి,ముత్తు రెడ్డి,మురళి కృష్ణ రెడ్డి,దామోదర్,శ్రీరాములు,ఢిల్లీ,మోహన్ గౌడ్ ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ముందుగా ఆలయంలో ప్రదక్షణలు చేసి అనంతరం పట్టుచీర,పండ్లు,పసుపు,కుంకుమ, పూలమాల,వక్కలు,తమలపాకులు,నిమ్మకాయలు మాల,వేపాకులతో కూడిన సారెను ఆలయ అర్చకులకు సమర్పించారు.
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ నిర్వాహకులు,వార్డ్ నాయకులు, అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
బుధవారం జరిగే జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,వయ్యల కృష్ణ రెడ్డి, లక్ష్మిపతి రెడ్డి బోర్డ్ సభ్యులు మున్నా రాయల్,జయశ్యం రాయల్ అలాగె మధు రెడ్డి,హౌసింగ్ బోర్డు రవి,సునీల్ రెడ్డి,హేమంత్ రెడ్డి,కార్తిక్ రెడ్డి,సాయి, సుబ్రహ్మణ్యం రెడ్డి,హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment