పేద మహిళలకు అండగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తోడుగా "జగనన్న అమ్మఒడి పథకం" - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జరిగిన "జగనన్న అమ్మఒడి పథకం" 3వ విడుత పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు,ఎంపీ మద్దెల గురుమూర్తి గారు,కలెక్టర్ వెంకటరమణా రెడ్డి గారు మరియు RDO హరిత గారు DEO శేఖర్ .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,చదువుకునే పిల్లలకు పేదరికం అనేది అడ్డుకకూడదని , అదేవిధంగా పిల్లలు చదువుకునేటప్పుడు పనులకు పోయి బడికి నిలిచిపోకూడదని మంచి ఉద్దేశంతో మన జగనన్న “జగనన్న అమ్మ ఒడి” ప్రవేశపెట్టారన్నారు.ఒక్క మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే మొత్తం 26,288 మంది విద్యార్ధులకు మొత్తం 43 లక్షలు రూపాయలు ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తున్నది అన్నారు.అలాగే సంవత్సరానికి రూ.20 వేల నుంచి రూ.24 వేలు చెలిస్తే కానీ, లబించని “బై-జూస్” విద్యను ఇకపై విద్యార్ధులకు ఉచితంగా అందించనున్నారు మన జగనన్న. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిన జగనన్నకు రాష్ట్ర అందరూ మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరారు.సేత్రువులందరు ఏకమైన కూడా జగనన్న ఒంటరిగా పోరాడుతున్నారని దేవుని దయ మీ అందరి ఆశీస్సులు ఉన్నంత వరకు జగనన్న ను ఎవరూ ఏమీ చేయలేరు అన్నారు. అమ్మ ఒడి రెండో విడత డబ్బులు విడుదల చేస్తున్న సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన తల్లిదండ్రులు మొహాల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే పరిష్కారమని కావున ప్రతి ఒక్కరు తమ పిల్లలను బడులకు పంపాలని తెలియజేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి అమ్మ ఒడి పాటకు నృత్యం చేసి జగనన్న కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే .
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment