మన శ్రీకాళహస్తిలో పుట్టిన కలంకారీకి కులం లేదు మతం లేదు : బియ్యపు మధుసూదన్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, June 24, 2022

మన శ్రీకాళహస్తిలో పుట్టిన కలంకారీకి కులం లేదు మతం లేదు : బియ్యపు మధుసూదన్ రెడ్డి

 మన శ్రీకాళహస్తిలో పుట్టిన కలంకారీకి కులం లేదు మతం లేదు, మన ఊరి కళకు ప్రపంచప్రఖ్యాతి చేసుకుందాం,కలంకారి కలను అభివృద్ధి చేసుకుందాం.ఉపాధి పొంది ఆర్థికంగా బలపరుద్దాం, మహిళలందరూ కూడా కలంకారీ కళ వైపు మొగ్గు చూపాలి అని కలంకారి ని ఆదరించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుచున్నాను- MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి  





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి 

శ్రీకాళహస్తి పట్టణంలోని భానోదయ కలంకారీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అధికారులు మరియు కలంకారి కళాకారులు పాల్గొన్నారు,ముందుగా ఎమ్మెల్యే గారు కలంకారి జుటీ బ్యాగ్స్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,భానోదయ కలంకారి 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. మన శ్రీకాళహస్తిలో పుట్టిన కలంకారీకి కులం లేదు మతం లేదు,మన ఊరి కళకు ప్రపంచప్రఖ్యాతి చేసుకుందాం,కలంకారి కలను అభివృద్ధి చేసుకుందాం.ఉపాధి పొంది ఆర్థికంగా బలపరుద్దాం, మహిళలందరూ కూడా కలంకారీ కళ వైపు మొగ్గు చూపాలి అని కలంకారి ని ఆదరించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుచున్నాను అన్నారు.కలంకారీకీ శ్రీకాళహస్తికి పెట్టింది పేరని ఆ పేరుప్రఖ్యాతులను కాపాడేవిధంగా దేశవిదేశాలలో శ్రీకాళహస్తిలో తయారుచేసే కలంకారి మంచి పేరు ఉందని,కలంకారి వస్త్రాలను కళాకారులు తయారు చేసేటప్పుడు నాణ్యమైన కలంకారీ వస్త్రాలను తయారు చేసి కలంకారీ ప్రియులకు అందజేయాలని కలంకారీ కళాకారులు కోరారు. కలంకారి వస్త్రాలలో చిన్నపాటి లోపాలు ఉన్న వాటిని అధికారులు అరికట్ట కలిగితే  నాణ్యమైన కలంకారీ వస్త్రాలను దేశ విదేశాలకు ఎగుమతిచేసి శ్రీకాళహస్తికి 

మంచిపేరు తీసుకురావాలని అధికారులు ఈ దిశగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను కోరారు. అలాగే కలంకారీ కళాకారులను ఎంత ఎక్కువ మందిని తయారు చేస్తే మన కలంకారీ వస్తువులు దేశవిదేశాల్లో ప్రఖ్యాతి చెందుతుందని ఆ విధంగా కళాకారులు అందరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి దేవస్థానం కి ఇచ్చేసి విఐపి లో కూడా నా సొంత డబ్బుతో కలంకారి కలంకారీ మరియు కలంకారి చీరలు అందజేస్తున్నామని దానివలన మన శ్రీకాళహస్తిలోని కలంకారీ కళాకారులు భవిష్యత్తులో వ్యాపార పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే పాత రోజులలో మహిళలు బీడీలు చుట్టుకొని వ్యాపారం చేసుకునే వారు కానీ నేడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్క మహిళ కలంకారి నేర్చుకుని మీ సొంతంగా మీరు ఎదగడానికి ఓ చక్కటి అవకాశం ఉంటుంది అన్నారు.అలాగే భానోదయ కలంకారి భవిష్యత్తు మరెందరికో స్ఫూర్తినిస్తూ ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ సందర్భంగా భానోదయ కలంకారి   యాజమాన్యం పాలురు పద్మావతి మరియు కళాకారులు ఎమ్మెల్యే గారికి కలంకారి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో లేపాక్షి చైర్మన్ విజయలక్ష్మి,DRDA PD తులసి,DCH AD సత్యమూర్తి, లేపాక్షి మేనేజర్ దేవేంద్ర,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad