అక్షయక్షేత్రంలో కోలా ఆనంద్ పుట్టినరోజు వేడుకలు
స్వర్ణముఖిన్యూస్ ,రేణిగుంట :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా 16. 06. 2022 తేదిన ఉదయం 11.00 గం.లకు రేణిగుంట విమానాశ్రయం మార్గంలో గల అక్షయక్షేత్రం లోని దివ్యాంగులకు భారతీయ జనతా పార్టీ ఓబీసీమోర్ఛా జిల్లా అధ్యక్షులు బి. డి. బాలాజీ ఆధ్వర్యంలో సుమారుగా 60 మంది దివ్యంగులకు టవలు, హెల్త్ డ్రింక్స్, బిస్కట్స్, పండ్లు మొదలైనవి వారికి ఉపయోగించబడే వస్తువులను పంపిణీ చేసి, కోలా ఆనంద్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓబీసీమోర్ఛా జిల్లా అధ్యక్షులు బి.డి. బాలాజి, మండల ఇన్ఛార్జ్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్ది ఈ సందర్భంగా మాట్లాడుతూ... మా ప్రియతమా నాయకులు కోలా ఆనంద్ కుమార్ పుట్టినరోజు కార్యక్రమాలను గత 20 సంవత్సరాలు ప్రజల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ పుట్టినరోజు సంధర్భంగా రేణిగుంట మండలంలో పలు సేవా కార్యక్రమాలను పేదలకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలని, పలు ప్రణాళికలు తయారు చేయబడిందని, ఇందుకు మండల పార్టీ కమిటీ సభ్యులు సహకరించాలని పిలుపునిచ్చారు.
తదుపరి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నా పుట్టినరోజు 20వ తేదిని పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని బిజెపి నాయకులు, అభిమానులు నిర్వహించు పుట్టినరోజు వేడుకలను అంగు ఆర్భాటం లేకుండా పేద ప్రజలకు ఉపయోగబడే విధంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించలాని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ రేణిగుంట మండల భారతీయ జనతా పార్టీ నాయకులకు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ధర్మారెడ్డి బొబ్బిలి రెడ్డి, ఓబీసీమోర్ఛా జిల్లా అధ్యక్షులు బి. డి. బాలాజీ, మండల ఇన్ఛార్జ్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్ది, జిలా కార్యదర్శి లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కోశాధికారి శ్యామ్ చంద్ గేహ్లాట్, జిల్లా మహిళమోర్చా సభ్యురాలు కలవలపూడి అన్నపూర్ణ, మండల ప్రధాన కార్యదర్శి పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు చింతంశెట్టి రాజా రాయల్, తంగావేలు శ్రీనివాస్, యువమోర్ఛా అధ్యక్షులు ఆవుల రాజా శేఖర్ రెడ్ది, గిరిజన మోర్ఛా అధ్యక్షులు గుండ్రాజుకుప్పం సుబ్రమణ్యం, కొండ కిశోర్, మణి మొదలైనవారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment