ఘనంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, June 19, 2022

ఘనంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం.

 మన తిరుపతి ప్రెస్ క్లబ్   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన సంస్థ రిజిస్ట్రేషన్  నెంబర్ 15/2022

అధ్యక్ష కార్యదర్శులు గా గుండ్రాజు సుకుమార్ రాజు

 ఘనంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం.

 సమాజానికి దిశా నిర్దేశం చేసే బాధ్యత మీడియాదే.

 రామకృష్ణ మఠం తిరుపతి సెక్రటరీ స్వామి సుకృతానందాజి.

 

 జర్నలిస్టుల సంక్షేమానికి కృషి.. చేస్తామన్నారు వ్యవస్థాపకులు మరియు అధ్యక్ష,కార్యదర్శులు.

 సమాజానికి దిశా నిర్దేశం చేసే బాధ్యత మీడియాదే అని రామకృష్ణ మిషన్ ఆశ్రమం తిరుపతి సెక్రెటరీ స్వామి సుకృతానందాజి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మీడియా పాత్ర  చాలాగురుతరమైనదని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అవసరం సమాజానికి ఎంతో అవసరమనిఅన్నారు. ఆదివారం మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ తొలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామి సుకృతానందాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సర్వతోముఖాభివృద్ధికి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంకృషి చేయాలన్నారు.పేద బడుగు బలహీన, మైనారిటీ, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి పాత్రికేయులు బాటలు వేయాలన్నారు. స్వామి వివేకానంద కూడా 1898 లో మాస మరియు పక్ష పత్రికను నడిపినగొప్ప మేధావి అని కొనియాడారు. విదేశాలలో భారతీయ ఔనత్యం పెంపొందించడానికి ఎనలేని కృషి చేశారన్నారు. సమాజంలో మూఢాచారాలు,దురాచారాలు,అవినీతి,అక్రమాల నిర్మూలనకు పాత్రికేయులు ముందుండి, పదునైన కలం ద్వారాకృషి చేయాలన్నారు. యువతను సన్మార్గంలో నడిపించే గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు.  యువతను అసాంఘిక కార్యకలపాల వైపు కాకుండా దేశ అభివృద్ధికి బాటలు వేసే విధంగా తీర్చిదిద్దాలన్నారు. సత్యం,ధర్మాన్ని కాపాడి దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా స్వామి సుకృతానందాజీ సీనియర్ పాత్రికేయులు ఆనందశర్మ,

శ్రీరామ్ సుకుమార్, నజీర్ భాషలను  ఘనంగా సత్కరించారు.

స్వామి సుకృతానందాజీ కి ఘనసత్కారం.




 మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ తొలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామి సుకృతానందాజీ ని మన తిరుపతి ప్రెస్ క్లబ్ పక్షాన వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి, తొలి అధ్యక్షుడు

గుండ్రాజు సుకుమార్ రాజు,  కార్యదర్శి పావులూరి పద్మనాభం నాయుడు, కార్యవర్గ సభ్యులుఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్వామిజీ వ్యవస్థాపకులు,  అధ్యక్ష కార్యదర్శులకు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించి ఆశీర్వదించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తొలి కార్యవర్గం నిరంతరం శక్తివంచన లేకుండా కృషిచేయాలని స్వామి ఆకాంక్షించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

 జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులుతపసి మురళి రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు గుండ్రాజు సుకుమార్ రాజు,  పావులూరి పద్మనాభం నాయుడులు పేర్కొన్నారు. మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసిన అనతికాలంలో నే మీడియా మిత్రులకు ప్రతిరోజు మధ్యాహ్నం ప్రెస్ క్లబ్ లో  ఒక్క రూపాయికే భోజన సదుపాయంకల్పించామన్నారు. జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించి వారి సంక్షేమమే ఏకైక అజెండాతో ముందుకు సాగుతాం అన్నారు.  జర్నలిస్టుల పిల్లల విద్యాభివృద్ధికి రాయితీతో కూడిన విద్య ను అందించేందుకుపాటు పడతా మన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు,  ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు.

 ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం, ఏడాదికి ఒకసారిజర్నలిజంపైశిక్షణా తరగతులునిర్వహించి చైతన్య పరుస్తామన్నారు.

 వైభవంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం


 పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పాత్రికేయుల సమక్షంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మన తిరుపతి ప్రెస్క్లబ్లో వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులఆశీర్వచన మధ్యవేడుకగాప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు గా గుండ్రాజు సుకుమార్ రాజు, పావులూరి పద్మనాభం నాయుడులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం సభ్యుల చేత వ్యవస్థాపకులు, అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు.  ఉపాధ్యక్షులుగా వార్తల శేషాద్రి, కల్లూరు రంగయ్య, సహాయ కార్యదర్శులు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంత్ నాయుడు, అత్తిరాల సూరిబాబు,  కోశాధికారిగా శ్రీరామ్ తీర్థప్రసాద గుప్తా, లీగల్ అడ్వైజర్ గా తొండవాడ రవిచంద్ర  కార్యవర్గ సభ్యులుగా రవిశేఖర్ వర్మ, వెంకటరమణ, చక్రపాణి, జయశ్యామ్, మునిబాబు, మనోజ్ కుమార్, మర్రిపాటి సతీష్,ప్రేమ్ నాథ్,కల్వకుంట్ల రమేష్,రాజమనోహర్ ,శ్రీకాంత్,హరి ప్రసాద్, రవికుమార్,  కో ఆప్షన్ సభ్యులు గా రాజారెడ్డి, భాస్కర్, హేమ కుమార్ రెడ్డి,  పిఆర్వో గా  ప్రకాష్, సతీష్, అజీజ్ ఖాన్, కన్వీనర్ గా రెడ్డి ప్రసాద్, కో కన్వీనర్ గా సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

 టిడిపి తిరుపతి నగర అధ్యక్షులు శంకర నారాయణ (చిన్న బాబు) తదితరులు పాల్గొని మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన  కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ  ప్రమాణ స్వీకార మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా 

ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, మరియు అధ్యక్ష కార్యదర్శులు కృతజ్ఞతలు తెలియజేశారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad