టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, June 25, 2022

టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

  టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

హైదరాబాద్‌:

 ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ ఆలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలకు హాజరుకాకుండా రాజకీయాలు, స్థిరాస్తి వ్యాపారం చేశారని జావీద్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad