శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు శ్రీ కలివేటి సంజీవయ్య కుటుంబ సమేతంగా విచ్చేశారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీ కలివేటి సంజీవయ్య గారు కుటుంబ సమేతంగా విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు మరియు కార్యనిర్వాహణాధికారి సాగర్ బాబు గారు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తదనంతరం శేష వస్త్రాలతో సత్కరించి వేదంపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి,స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమం లో మహీధర్ రెడ్డి గారు, మల్లిఖార్జున రెడ్డి మరియు చిందేపల్లి మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment