కుమార స్వామి ఆలయంలో గణపతి పూజ కలశ స్థాపన పుణ్య వచనము
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన విజ్ఞాన గిరి కొండపై వెలసివున్న కుమార స్వామి ఆలయంలో బాలలయం పూజా కార్యక్రమాలలో భాగంగా బుధవారం ఉదయం గణపతి పూజ కలశ స్థాపన పుణ్య వచనము, వరుణ పూజ కలశానికి పూజలు చేసి హోమములు నిర్వహించి కలశానికి ప్రత్యేకపూజలు హారతులు సమర్పించి విమాన గోపురమునకు కుమారస్వామి, ధ్వజస్తంభము చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసి కలశాలతో ఆలయంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి కుమారస్వామి ధ్వజస్తంభము విమాన గోపురానికి కలిశాభిషేకం నిర్వహించిన అనంతరం దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన కర్పూర హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి గార్లు ప్రధానార్చకులు స్వామినాథన్ గురుకుల్, వేద పండితులు అర్ధగిరి స్వామి లతోపాటు దేవస్థాన అధికారులు ధనపాల్, లక్ష్మయ్య ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment