మున్సిపల్ కార్మికులకు ఇళ్లను రెగ్యులరైజ్ చేసి పట్టాలుఇవ్వాలి సిపిఎం డిమాండ్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, June 10, 2022

మున్సిపల్ కార్మికులకు ఇళ్లను రెగ్యులరైజ్ చేసి పట్టాలుఇవ్వాలి సిపిఎం డిమాండ్

 మున్సిపల్ కార్మికులకు వారు నివసిస్తున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసి పట్టాలుఇవ్వాలి  సిపిఎం డిమాండ్


స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి  :

 జనం కోసం సిపిఎం ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా మూడవరోజు పట్టణంలోని సొంత మైదానం ఏరియా లో సిపిఎం పార్టీ నీ సొంత మైదానం శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మైదానం లోని మున్సిపల్ కార్మికుల సమస్యలను సిపిఎం నాయకులకు తీసుకొనివచ్చి 50 సంవత్సరాలుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న మాకు ఇక్కడ నివాసగృహాలు కట్టించి 70 కుటుంబాల వారికి ఇవ్వడం జరిగిందని అప్పటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని కానీ ప్రస్తుత మున్సిపల్ అధికారులు ఈ స్థలాన్ని సర్వే చేస్తూ ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాలంటూ చెప్పి వెళ్లారు అని ఆ కాలనీవాసులు సిపిఎం నాయకులు దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి గంధం మని మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా నివాసముంటున్న పారిశుద్ధ్య కార్మికులను ఖాళీచేయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కార్మికుల తరఫున ముందుండి పోరాడతామని వారికి హామీ ఇచ్చారు కమిషనర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చి అక్కడ నివసిస్తున్న 70 కుటుంబాల వారికి వారి నివాస స్థలాలను వారికే రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి  చట్ట కార మిట్ట కాలనీ కి ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదని వెంటనే ఆ కాలనికి సిమెంటు రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే చాలామంది tidco ఇళ్లకు డబ్బులు కట్టిన ఇళ్లను అప్పగించ క పోవడంతో బాడుగ కట్టలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి అని వెంటనే సంబంధిత లబ్ధిదారుల ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి kuppamma రాధమ్మ పార్టీ నాయకులు గురవయ్య మూర్తి వెళ్లి వేంద్రం చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad