జగన్ గారూ...! మా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఉన్న పరిశ్రమలకే మళ్లీ ప్రారంభోత్సవాలా...?
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
-టీడీపీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఎద్దేవా చేశారు
తెలుగుదేశం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమిపూజ, ప్రారంభోత్సవం చేసిన పరిశ్రమలకు మళ్లీ భూమిపూజ, ప్రారంభోత్సవం చేయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తుండటం సిగ్గుగా ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి గారి చొరవతో ఏర్పేడు మండలం వికృతమాల వద్ద టీసీఎల్ పరిశ్రమకు భూమి పూజ చేశారన్నారు. చంద్రబాబు కృషితోనే తిరుపతికి టీసీఎల్ పరిశ్రమ వచ్చిందన్నారు. ప్రస్తుతం అక్కడ ఉత్పత్తులు కూడా జరగుతున్నాయని ఆమె చెప్పారు. ఈ పరిశ్రమ ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సొమ్ము ఒకరిది... సోకు ఒకరిది’ అనేది ఇలానే ఉంటుందని చక్రాల ఉష ఎద్దేవా చేశారు. ఇక సన్నీ ఓపో టెక్నాలజీస్, ఫ్యాక్స్ లింక్, ప్యానల్ ఆప్టో డిస్ ప్లే పరిశ్రమలు కూడా చంద్రబాబు హయాంలో వచ్చినవేనని ఆమె తెలిపారు. ఈ పరిశ్రమలు రావడానికి చంద్రబాబు ఎంతో కష్ట పడ్డారని చెప్పారు. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలను తాము తెచ్చినట్లుగా జగన్ ప్రభుత్వం చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. వికృతమాల వద్ద రూ.25వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు హయాంలో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్ సంస్థ జగన్ విధానాలకు భయపడి వారు వెనక్కు వెళ్లి పోయారన్నారు. ఈ పరిశ్రమ వెనక్కు పోవడం వలన ఈ ప్రాంతంలో వేలాది మంది ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చక్రాల ఉష ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు సమీపంలో నిర్మించనున్న హిల్ టాప్ సెజ్ డెవలప్ మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (అపాచి) పరిశ్రమ కూడా చంద్రబాబు హయాంలోనే ఒప్పందం కుదుర్చున్నట్లు ఆమె గుర్తు చేశారు . అప్పట్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరడగంతో భూమిపూజ చేయలేదన్నారు. ఇది కూడా తామే తెచ్చినట్లు జగన్ ప్రభుత్వం చెబుతుండటం హాస్యాస్పదoగా ఉందన్నారు. ఇక్కడ భూమి ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు చక్రాల ఉష ఆరోపించారు. రైతులకు అందాల్సిన పరిహారంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఎకరాకు రూ.6లక్షలు వంతున తీసుకున్నారన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిన సత్యమన్నారు. జగన్ విధానాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అనేక పరిశ్రమలు వెనక్కు వెళ్లాయన్నారు. ఈ కారణంగా సుమారు 2లక్షల మంది ఉపాధి కోల్పోవలసిన పరిస్ధితి ఏర్పడిందన్నారు. ప్రజలు ఈ విషయం గమనించాలని చక్రాల ఉష కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్పారు. జగన్ చెప్పే అబద్దపు మాటలు ఎవరూ నమ్మకూడదన్నారు.యువత భవిష్యత్తు అంధకారంలో నెట్టబడిందని యువతకి రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తానని ప్రతీ సంవత్సరం ఉద్యోగకేలండర్ ఇచ్చి యువతని ఉద్దారిస్తానని మోసం చేసిన ఘనత జగన్ రెడ్డికే చెల్లిందని, యువత ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రైవేటు ఉద్యోగాలు లేక వారి యొక్క బతుకులు రోడ్డున పడ్డాయని గుర్తు చేస్తూ జాబు రావాలన్నా యువత భవిష్యత్ కి బంగారు బాటలు వేయాలన్నా , మహిళలకు భద్రత, విద్యార్థులకు భరోసా కల్పించాలన్నా బాబు కి మాత్రమే సాధ్యమని తెలియజేసారు
No comments:
Post a Comment