మన బడి నాడు, నేడు పనులు వేగవంతం కావాలి - కమిషనర్ అనుపమ అంజలి
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో మన బడి నేడు, నాడు పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్ పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాలు, సచివాలయ ఎడ్యుకేషన్ సెక్రటరీలతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ మనబడి నాడు, నేడు రెండవ దశ పనుల్లో జెడ్.పి, ఎం.పి.పి పాఠాశాలలు 16, నగరపాలక సంస్థ పాఠశాలలు 25తో మొత్తం 41 పాఠశాలలకు ఓక కోటి తొంబై రెండు లక్షలు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం ఏడున్నార లక్షలు మాత్రమే ఖర్చు చేయడాన్ని ప్రస్థావిస్తూ, పనులు వేగవంతం చేయడానికి వున్న అడ్డంకులను అధికమించాలన్నారు. పాఠశాలల్లో నీటి సమస్యని అధిగమించేందుకు నీటి వసతి కోసం ఖర్చు చేయాలని, ఎలక్ట్రిక్ వర్కులు కావల్సిన చోట, వెంటనే పనులు చేపట్టాలని, టాయిలెట్స్ అవసరమున్న పాఠశాలల్లో వెంటనే పనులు ప్రారంభించి నిర్మించాలని, పాఠశాలలకు ప్రహారి గోడ పనులు పెండింగ్ లో వుంటె పూర్తి చేయాలని ప్రధాన ఉపాధ్యాయులకు కమిషనర్ సూచించారు. ఇంజనీరింగ్ అధికారులను ఉద్దెసించి మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టాల్సిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాలు జారీ చేసారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ తంబల సునీత, మనబడి నాడు, నేడు జిల్లా కో ఆర్డినేటర్ రామచంధ్రా రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, చంధ్రశేఖర్ రెడ్డి, సంజయ్ కుమార్, రవీంధ్రరెడ్డి, గోమతి, మునిసిపల్ పాఠశాలల డిప్యూటీ ఈఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment