సాప్ట్ వేర్లు సమాజ సేవ చేయడం అభినందనీయం - ముద్రనారాయణ, డిప్యూటీ మేయర్
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
సాప్ట్ వేర్లు సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ అన్నారు. తిరుపతి భైరాగిపట్టెడ ఆర్చ్ వద్ద ఫెడరల్ సాప్ట్ సిస్టమ్ (ఎఫ్.ఎస్.ఎస్.) వారి నిర్వహణలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముద్రనారాయణ ప్రారంబించి, మొదటిరోజు సందర్భంగ మినరల్ వాటర్ తోబాటు మజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ వేసవికాలంలో చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. సాప్ట్ వేరు సంస్థలు ముఖ్యంగా ఎఫ్.ఎస్.ఎస్ వారు ప్రజలకు ఉపయోగార్ధం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫెడరల్ సిస్టమ్ ఎం.డి. కిశోర్ రెడ్డి, సిఈఓ యడం కిశోర్ మాట్లాడుతూ ఫేడరల్ సిస్టమ్ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ గారి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం చలివేంద్రాలతో బాటు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ ప్రజా సంబంధాల అధికారి సురేంధ్ర రెడ్డి, ఫెడరల్ సాప్ట్ సిస్టమ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment