కోలాహలం గా కోలా జన్మదిన వేడుకలు
నేడు ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గ, బిజెపి పార్టీ ఇంచార్జి శ్రీ కోలా ఆనంద్ గారి జన్మదినము సందర్బంగా నియోజకవర్గం అంతా కూడా పార్టీ నాయకులు, కోలా గారి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణంలో సుమారు 30 ప్రాంతాల్లో ప్రజలకు స్వయంగా శ్రీ కోలా ఆనంద్ గారు హాజరు అయ్యి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్ర, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ జిల్లాల నుంచి పలువురు ముఖ్య నేతలు స్వయంగా వారి నివాసానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా శ్రీ కోలా ఆనంద్ గారు మాట్లాడుతూ, నా పుట్టినరోజు సందర్బంగా గత 4రోజుల నుండి నియోజకవర్గములో ప్రజలకు ఉపయోగ పడేలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన నా పార్టీ నాయకులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా నా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు తెలియజేస్తూ, అధికారంతో పనిలేని, వెలకట్టలేని మీ అభిమానాన్ని పొందే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, నా కృతజ్ఞతలు తెలియజేస్తూ..నాకు మనస్ఫూర్తిగా మీ ఆశీస్సులు అందజేసిన పెద్దలకు నా పాదాభివందనం
పై కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు భానుప్రకాష్రెడ్డి, సామంచి శ్రీనివాస్, కేతినేని సురేంద్రమోహన్, గుడిసె సాయి దేవానంద్, మరియు శ్రీ వూకా విజయ్ కుమార్ గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ కమిటీ సభ్యులు,పట్టణములోని ప్రముఖులు మీడియా సోదరులు, కోలా గారి అభిమానులు పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
No comments:
Post a Comment