రాజీవ్ నగర్ లో కనీస వసతులు కల్పించండి సిపిఎం.
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
జనం కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు రాజీవ్ నగర్ కాలనీ లో సిపిఎం నాయకులు ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాలనీలో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు కాలనీలోని ప్రధాన వాటర్ ట్యాంకు వెళ్లే తెలుగుగంగ పైప్ లైన్ మరమ్మతులకు గురై మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు దాన్ని పూర్తి చేసి కాలనీ ప్రజలకు నీరు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనివల్ల ప్రజలు మంచి నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా నాయకులు దృష్టికి స్థానిక కాలనీవాసులు తీసుకు వచ్చారని తెలిపారు మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు అలాగే కాలనీలో 1000 కుటుంబాలకు పైగా కాపురం ఉంటున్నారని వీరికి అంగన్వాడీ కేంద్రం అందుబాటులో లేక 5 సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడి స్కూల్ కి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ సమస్యను స్థానిక సిడిపిఓ గారు స్పందించి చి రాజీవ్ నగర్ లో ప్రతి వంద కుటుంబాలకు ఒక మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రాథమిక పాఠశాల చాలా దూరంగా ఉన్నందువల్ల కైలాసగిరి కాలనీ కి రామచంద్రపురం కు పిల్లల వెళ్లాల్సి వస్తుందని దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవు తున్నాయని తెలిపారు డిఇఓ గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఒక ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రోడ్లు డ్రైనేజీ వీలైతే సమస్యలు చాలా ఉన్నాయని దీనిపై ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గంధం మణి నాయకులు పీ గురవయ్య , కాలనీవాసులు బత్తయ్య సురేష్ మారయ్య మునెమ్మ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment