ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, June 25, 2022

ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత

 ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత


అమరావతి:

 గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా తెదేపా శ్రేణులు నిరసన తెలుపుతారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారుసరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ప్రజావేదిక లో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం జగన్‌... అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అదే రోజు రాత్రి కూల్చివేత పనులు చేపట్టారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజు తెదేపా శ్రేణులు ప్రజావేదిక కూల్చివేసిన ప్రాంతంలోని శిథిలాల వద్ద నిరసన తెలుపుతున్నారు.

ఈఏడాదికూడా తెదేపాశ్రేణులు నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమై చంద్రబాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు.చంద్రబాబు నివాసానికి వెళ్లే మూడు మార్గాలను బారికేడ్లు, ముళ్లకంచెలతో మూసివేశారు. కొండవీటి వాగువైపు, ఉండవల్లి గుహల వైపు, సచివాలయం నుంచి విజయవాడవైపు వచ్చే మూడు దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ముళ్లకంచెల, బారికేడ్లతో దిగ్బంధించారు. సామాన్య ప్రజలు సైతం ఇటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తమ పొలాల వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad