ఆహార అలవాట్లు మార్చుకొని, రోజు యోగ చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం గా ఉంటామని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి జడ్జి లు రాఘవేంద్ర, నరేంద్ర రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భముగా సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలమేరకు శ్రీకాళహస్తి కోర్ట్ ఆవరణలో యోగ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్రరెడ్డి , యోగ మాస్టర్ భారతి నాట్టార్, కోర్ట్ సిబంది, యోగ విద్యార్థులు...మొదలైనవాలు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర మాట్లాడుతూ.... యోగ గురించి వినడం, యోగాన్ని అభ్యాసం చేయడం, యోగాన్ని ఇతరులకు అందించడం,యోగ వ్యాప్తికి తోడ్పడే కార్యక్రమంలో పాల్గొనడం అన్నీ కూడా యజ్ఞం తో సమానము, అలాగే ఆహార అలవాట్లు మార్చుకొని, రోజు యోగ చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం గా ఉంటామని తెలిపారు.
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ.... యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. అందరిదన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. భారత ప్రత్యేకత, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింభిస్తుందని, కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్నారు. యోగా దినోత్సవం అనేది ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అన్నారు.
No comments:
Post a Comment