నాటుసారా, గంజాయి, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, June 25, 2022

నాటుసారా, గంజాయి, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

నాటుసారా, గంజాయి, మద్యం అక్రమ రవాణా  నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో



స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:

 నాటుసారా, గంజాయి, మద్యం అక్రమ రవాణా తదితర నేరాల నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, లేని పక్షంలో ఆశించిన ఫలితాలు సాధించలేమని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ డి.ఐ.జి రమేష్ రెడ్డి ఐ.పి యస్, మరియు జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తిరుపతి జిల్లా పోలీసులు మరియు ఎస్ ఈ బి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని పోలీసు అతిథిగృహంలో శనివారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ శ్రీ రమేష్ రెడ్డి ఐ.పి.యస్., గారు జిల్లా ఎస్పి పరమేశ్వర్ రెడ్డి ఐ.పి.యస్ గారు మరియు అడ్మిన్ అడిషనల్ ఎస్ పి/ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తిరుపతి సుప్రజ మేడం గారితో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ ఈ బి డిఐజి శ్రీ రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ నాటు సారా తయారీ మరియు రవాణా, గంజాయి సరఫరా మరియు అమ్మకం , పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా, నిషేధిత పొగాకు ఉత్పత్తులు తదితర అసాంఘిక చర్యలు జరగకుండా పోలీసులు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం అధికారులు చేపడుతున్న ప్రయత్నాలపై ఆయన పెదవి విరిచారు.
జిల్లావ్యాప్తంగా నాటుసారా తయారీ మరియు సరఫరాను కూకటివేళ్లతో పెకలించి చడానికి పోలీస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పోలీసు మరియు ఎస్ ఈ బి అధికారులు కలిసి నాటుసారా తయారీ మరియు సరఫరా రహస్య విక్రయాలపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించి నిర్మూలనకు కృషి చేయాలన్నారు.
అవగాహన కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలలో తరచుగా నిర్వహిస్తూ నాటుసారా సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలను, కుటుంబ ఎదుర్కొనే సమస్యలను కూలంకషంగా వివరిస్తూ, నాటు సారా తయారీ నియంత్రణలో గ్రామీణ భాగస్వామ్యం చేస్తూ వారి ద్వారా సమాచారం సేకరించి నాటు సారా తయారు చేసే వ్యక్తులను అదుపులోకి తీసు కోవాలని, నాటు సారా తయారు చేయడానికి ఆలోచన కూడా రాకుండా మెరుపుదాడులు నిర్వహించాలని సూచించారు.
అనంతరం జిల్లా ఎస్పి శ్రీ.పి. పరమేశ్వర్ రెడ్డి ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ వెంకటగిరి గూడూరు సూళ్లూరుపేట తదితర ప్రాంతాలలో నాటుసారా కేసులు నమోదు శాతం తక్కువగా నమోదు
కాబడుతుంది, ఆ ప్రాంతాలలో తయారీ తక్కువగా ఉన్నందున కేసులు లేకపోవడంతో, ఆ సిబ్బంది ఇతర ప్రాంత పోలీసు స్టేషన్ అధికారులు సిబ్బంది తో సమన్వయం చేసుకొని నాటు సారా తయారు చేసే ప్రాంతాలలో దాడులు నిర్వహించడంలో సహకరించాలని సూచించారు.
జిల్లాలో నాటు సారా నియంత్రణపై అదేవిధంగా గంజాయి అమ్మకం అణిచివేయడం పై జరుగుతున్న ప్రయత్నాలు సంతృప్తికరంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తూ , దాడులు ముమ్మరం చేయడమే కాక నాటు సారా తయారీ స్థావరాల కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో సబ్ మరియు పోలీసు సిబ్బంది వారి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గంజాయి ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాల బారినపడి ఎందరో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాక తమ తల్లిదండ్రులను సైతం ఆవేదనకు గురి చేస్తున్నారని, ఈ అలవాట్ల వలన కలిగే దుష్పరిణామాలను యువతకు అర్థమయ్యే రీతిలో చెప్పడంలో పోలీసులు కీలకపాత్ర పోషించాల్సి ఉందని తెలిపారు.
జిల్లాలో ఇప్పటికీ పలు ప్రాంతాలలో నాటుసారా అమ్మకం గంజాయి అమ్మకం వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయని, పూర్తిస్థాయిలో ఇటువంటి కార్యకలాపాలను అణచివేయడానికి వ్యూహరచన చేయడంలో పోలీసులు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది సమిష్టిగా పని చేయాలన్నారు.
కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు కాకపోవడంతో తమకు పని లేదనుకుంటా కాలయాపన చేయడం సరికాదని, నాటు సారా సమస్య ఉన్న ప్రాంతం పోలీసులతో సమన్వయం చేసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, సారా తయారీ పూర్తిస్థాయిలో నిర్మూలనకు చర్యలు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎక్సైజ్ శాఖ సిబ్బంది కార్యాచరణ వైపు మొగ్గు చూపాలి అని కోరారు.
అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరియు తరచుగా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ నాటుసారా అమ్మకం , నిషేధిత పదార్థాలైన పొగాకు ఉత్పత్తుల అమ్మకం సాగుతున్న అంటే పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల పనితీరు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుందని, ఇకనైనా అధికారులు సిబ్బంది కలిసి సారా మహమ్మారిని తరిమివేయడానికి తన వంతు బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి స్వాతి మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు ఎస్ ఈ బి అదికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad