ఆకస్మిక తనిఖీలు చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రీతు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని పలు మెడికల్ షాపులను ప్రభుత్వ, జిల్లా డ్రగ్ కార్యాలయం ఆదేశాల మేరకు ఆకస్మిక పరిశీలన జరిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రీతు మరియు డ్రగ్ తనిఖీ సిబ్బంది పాల్గొన్నారు.
డ్రగ్ ఇన్స్పెక్టర్ రీతు మాట్లాడుతూ..... ప్రతి మెడికల్ షాప్ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. అలాగే ఎక్సపైర్డ్ మందులను వాడకూడదని మెడికల్ షాప్ యాజమాన్లకు సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ సూచన అతిక్రమిస్తే ఎవరికైనా జరిమానా విధించడం లేక డ్రగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు
No comments:
Post a Comment