జగనన్న కాలనీ లో నాణ్యత డొల్ల , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ లో నాణ్యతా ప్రమాణాలు అంతంత మాత్రమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతుండటంతో పదేళ్లకే మూసుకుపోయి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోమవారం శ్రీనివాస రావు రాజీవ్ నగర్ లో నిర్మితమవుతున్న జగనన్న కాలనీలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న ఇంటి నిర్మాణాలను, నాణ్యత ను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెంటు భూమి లో ఇల్లు కట్టుకోవడం కష్టమే అన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ 1.80 లక్షలు ఏం మొలకే సరిపోదనీ, దీంతో కాంట్రాక్టర్లు నాసిరకంగా ఇల్లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. జగనన్న కాలనీల పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకమైన సామగ్రితో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారనీ, క్రషర్ డస్టుతో తయారుచేసిన సిమెంటు ఇటుకలు పాడుతున్నారని వాపోయారు. పేదోడికి నాణ్యమైన ఇల్లు తయారవ్వాలంటే కనీసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందనీ, ఆ మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చిక్కులను పరిశీలించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య, గంధం మణి, దాసరి జనార్దన్, పెనగడం గురవయ్య, గెడి వేణు, సెల్వం, వెంకటేష్, వెలివేంద్రం, ఈశ్వరయ్య, రాజా, దాము, చిన్న తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment