నల్ల బాడ్జీలను ధరించి శ్రీకాళహస్తి మునిసిపల్ కార్యాలయము ముందు నిరసన :బి. బాలాజీ నాయక్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పురపాలక సంఘము నందు రాయచోటి మునిసిపల్ కమిషనరు రాయప్రోలు రాంబాబు గారి పై గురువారము విధులలో ఉండగా కొందరు వ్యక్తులు దౌర్జన్యము చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మునిసిపల్ కమిషనరు శ్రీ. బి. బాలాజీ నాయక్ గారి ఆధ్వర్యములో నల్ల బాడ్జీలను ధరించి మునిసిపల్ కార్యాలయము ముందు నిరసన వ్యక్తము చేయడము జరిగినది. పై దౌర్జన్యము జరిగిన ఘటనపై మునిసిపల్ కమిషనరు శ్రీ బి. బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఉదోగ్యులకు భద్రత కల్పించాలని, సమన్వయముతో కలిసి పనులు చేసుకోవాలని, ఇటువంటి సంఘటలు పునరావృతము కాకుండా ఉండాలని కోరారు.
సదరు నిరసన కార్యక్రమము నందు మేనేజర్ ఉమామహేశ్వర రావు, అసిస్టెంట్ ఇంజనీర్ లలిత, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పి.రవికాంత్, బాల చంద్రయ్య, సిబ్బంది సురేష్, హుస్సేన్, అల్లూరయ్య, శ్రీనివాసులు, శైలజ, ప్రియాంక, కుమార్, సంధ్య మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment