లారీ, బైక్ ఢీ. మంటల్లో కాలి బూడిదైనా లారీ, బైకు. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, June 23, 2022

లారీ, బైక్ ఢీ. మంటల్లో కాలి బూడిదైనా లారీ, బైకు.

 తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై భాకరాపేటలో లారీ, బైక్ ఢీ.  మంటల్లో కాలి బూడిదైనా లారీ, బైకు. 

స్వర్ణముఖి న్యూస్, తిరుపతి: 

 తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమలో తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ, ద్విచక్ర వాహనం దగ్ధమయ్యాయి. ఓ లారీ కదిరి నుంచి నెల్లూరుకి మొక్కజొన్న పొట్టుతో వెళ్తుంది. భాకరాపేట కనుమ దారిలో దయ్యాలకోన వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. అనతంరం కొంతదూరం బైకును లాక్కెళ్లింది. ఈ క్రమంలో చెలరేగిన మంటల్లో రెండు వాహనాలు ఖాళీ బూడిదయ్యాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం తెలుసుకున్న రంగంపేట గ్రామస్థులు, చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడ్డ యువకుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad