ఎన్టీఆర్ భరోసా పింఛన్లు జయచంద్ర నాయుడు పంపిణీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటో తారీఖున సూపర్ సిక్స్ పథకాలలో పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, బొజ్జల సుధీర్ రెడ్డి ,ఆదేశాల మేరకు, తొట్టంబేడుమండలంలోని , తొట్టంబేడు గ్రామం,కారాకొల్లు , శివనాధపురం, పూడి, పంచాయతీలో పాల్గొన్నారు, ఈపెన్షన్,కార్యక్రమాన్ని,పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే,బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకుఎన్టీఆర్ భరోసా పింఛన్లు టిడిపి సీనియర్ నాయకుడు , తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, జయచంద్ర నాయుడు పంపిణీ చేశారు. జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను సచివాలయలయ సిబ్బంది కలసి జయచంద్ర నాయుడు లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల సందర్భంగా సిఎం నారా చంద్రబాబు నాయుడు ,ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులతో కలసి జయచంద్ర నాయుడు సిఎంకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి,కృతజ్ఞతలు తెలియజేశారు.
తొట్టంబేడు మండలం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,జయచంద్ర నాయుడు మాట్లాడుతూ..
ఓ రాష్ట్ర సీఎం స్వయంగా ఇలా పింఛన్లు పంపీణీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు.కొత్త ప్రభుత్వంలో మొదటగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమమని చెప్పారు. ప్రజలజీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడిందని తెలిపారు. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ చెప్పారని, ఆయన స్ఫూర్తితో తమ చంద్రన్న ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామకృష్ణ నాయుడు, శంకరయ్య, ఎంపీటీసీ నాగరాజు, గణేష్, చంగమ నాయుడు, ధనుంజయులునాయుడు వెంకటరమణ నాయుడు తదితరులు పాల్గొన్నారు,
No comments:
Post a Comment