బంగారమ్మకు శివయ్య సారె సమర్పించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి సారె సమర్పించారు.మంగళవారం కైలాసగిరి కాలనీ వద్ద వెలసిన బంగారమ్మ తల్లికి ఎమ్మెల్యే మంగళ వాయిద్యాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ఆలయ ఛైర్మెన్ అంజూరు తారక శ్రీనివాసుల ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ముందుగా ఆలయంలో ప్రదక్షణలు చేసి అనంతరం పట్టుచీర,పండ్లు,పసుపు,కుంకుమ, పూలమాల,వక్కలు,తమలపాకులు,నిమ్మకాయలు మాల,వేపాకులతో కూడిన సారెను ఆలయ అర్చకులకు సమర్పించారు.
బంగారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ నిర్వాహకులు,వార్డ్ నాయకులు, అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
బుధవారం జరిగే జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లీలా,చంద్రయ్య నాయుడు,దేవస్థానం బోర్డు సభ్యులు సుమతి, రమ ప్రభ,మున్నా,జయశ్యామ్ మరియు ప్రభాకర్,చంద్రశేఖర్, ధనంజయలు,షణ్ముగం, పుట్టామహేష్,తేజ,కొల్లూరు హారి నాయుడు మరియు కమిటీ సభ్యులు జై బాబు,సుధాకర్ రెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment