శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి మండలం మరియు తొట్టంబేడు మండలం నందు మండల ఎంపిడిఓల ఆధ్వర్యంలో అధికారులతో ప్రజాప్రతినిధులతో సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖలో జరిగిన మండలలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారి దృష్టికి గారి తీసుకువెళ్లారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తమతమ పరిధిలోని మండలాలలో ప్రజలతొ మమేకమవుతూ ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేసే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొనివస్తే, సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు కావాల్సిన సేవలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈనెల 23వ తేదీన గౌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అపాచీ మరియు TCL పరిశ్రమ భూమిపూజ కార్యక్రమానికి వస్తున్నారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ముతోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
ఇస్తున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ప్రజలకు మెరుగైనసేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండలం ఇంచార్జ్ బియ్యపు పవిత్ర రెడ్డి గారు శ్రీకాళహస్తి మరియు తొట్టంబేడు మండల ఎంపిపి, జడ్పీటీసీ,ఎంపీటీసీలు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment