శ్రీకాళహస్తీశ్వరాలయం నిత్యఅన్నదానం కు రూ.1,10,116/- వితరణ
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానమునకు విరాళంగా కర్నూలు జిల్లా, ఆదోని వాస్తవ్యులైన శ్రీ ధనలక్ష్మి-కుటుంబరావు కుటుంబ సభ్యులతో కలిసి రూ. 1,10,116/- లు శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మాకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి ఆలయములోని దక్షణామూర్తి సన్నిధిలో వద్ద అందజేశారు. తదనంతరం వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి భక్తులకు అన్న ప్రసాదాల కోసం దానం చేసిన వారికి వారి కుటుంబాలకి స్వామి అమ్మవార్ల కృప కటాక్షాలు ఎల్లప్పుడూ తోడుం టాయని చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులుసహాయ కమీషనర్ శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment