68 లక్షల విలువచేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేయడం అమ్మడం ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం నేరం.
మద్యం అక్రమ రవాణాపై లేదా అక్రమ అమ్మకాలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి... జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం గానీ, అమ్మడం గాని ఏ.పీ ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా శిక్ష గురవుతారని జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్ గారు హెచ్చరించారు.
రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులమండ్యం - తండ్లం మార్గం లో గల గాజులమండ్యం, చిన్న చెరువు వద్ద అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం బాటిళ్లను, అనుమతి లేకుండా బెల్టు షాపుల ద్వారా అమ్ముతుండగా పట్టుబడిన మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మెంట్ బ్యూరో అధికారుల సమక్షంలో పోలీసులు మంగళవారం ధ్వంసం చేయడం జరిగింది.
దాదాపు 32,341 వివిధ రకాల పరిమాణంలో ఉన్న మద్యం బాటిళ్లను (క్వార్టర్, హాఫ్, ఫుల్) రోడ్ రోలర్ సహాయంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ మరియు తిరుపతి జిల్లా అడిషనల్ యస్.పి అడ్మిన్ శ్రీమతి ఈ.సుప్రజ గారు, సేబ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి స్వాతి గార్ల సమక్షంలో లో వాటిని ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పలు సందర్భాల్లో పట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా అనుమతిలేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తూ అమ్ముతుండగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను కూడా దాదాపు 32,341 అన్ని క్వాంటిటీ ల బాటిల్ లు (6,797 లీటర్లు) బాటిళ్లను రోడ్లు రోడ్ రోలర్ సాయంతో ధ్వంసం చేయడం జరిగిందని వీటి విలువ దాదాపు 68 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
అధిక సంపాదనకు ఆశపడి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను సరఫరా చేసి వాటిని అమ్మడం చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే శిక్షార్హులు కాక తప్పదని హెచ్చరించారు.
అదేవిధంగా అనుమతిలేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తూ మద్యం అమ్మకాలు చేయరాదని, అటువంటి వారిని కూడా చర్చించడం జరుగుతుందని చెప్పారు.
ఇటీవల కాలంలో అక్రమ ధనార్జన కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చాలామంది ముఖ్యంగా యువకులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆయన సూచించారు.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీ.డీ యాక్టు లు కూడా నమోదు చేయవలసి వస్తుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను, సిబ్బందిని జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు అభినందిస్తూ, దాడులను మరింతగా ముమ్మరం చేసి పూర్తిస్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తిరుపతి జిల్లా మీదుగా రాష్ట్రం లోకి ప్రవేశించ కుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
తిరుపతి జిల్లా తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వారికి తిరుపతి జిల్లా మీదుగా సరఫరా చేస్తూ రాష్ట్రంలో అక్రమ మధ్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని కావున తమిళనాడు నుంచి తిరుపతి జిల్లాలోకి వచ్చే దారులు అన్నింటిలోనూ ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను ముమ్మరం చేస్తూ దాడులు నిర్వహించి పూర్తిస్థాయిలో ఈ స్మగ్లింగ్ను అరికట్టడానికి మరింతగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గూడూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, తిరుపతి ఏ.ఈ.యస్ శ్రీనివాసరావు, గూడూర్ ఏ.ఈ.యస్ జానికిరాం, సి.ఐ ఆరోహన రావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు
No comments:
Post a Comment