మెదడుకు మొలిచిన అపారమైన డిగ్రీలు, వెక్కిరిస్తున్న నిరుద్యోగం
అతనొక సరస్వతీ పుత్రుడు.ఒక్క డిగ్రీ సాధించడానికే ఆప సోపాలు పడి ముక్కి, మూలిగి గట్టెక్కలేని యువతకు అతను సాధించిన విద్యార్హతలు ఆదర్శం కావాలి.ఒక్క సైన్స్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యు యేషన్ పూర్తి చేయాలి అంటే మధ్యలోనే చతికిలపడిపోయే పరి స్థితులను ఎదుర్కొంటున్న యువత ఉన్న ప్రస్తుత తరుణంలో ఏకంగా ఆరు సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తిచేశాడు. అలాగే ఐదు సర్టిఫికెట్ కోర్సులలో ఉత్తీర్ణత సాధించాడు.ఇంకా మరి కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఆక్వా కల్చర్, జువాలజీ,బొటనీ,మైక్రో బయాలజీ, ఎన్విరా న్మెంటల్ సైన్స్ లలో పి.జీ స్థాయిలో డిగ్రీలు సాధిం చాడు.అలాగే 30 పరి శోధన పత్రాలు, ఇంకా ఎం.టెక్, బయో టెక్నాలజీ లో మొదటి పీ.హెచ్డీ, జువాలజీ లో రెండవ పీహెచ్డీ సాధించాడు.ఇంకా జాతీయ స్థాయిలో నిర్వ హించే సీ.ఎస్.ఐ.ఆర్, యూ. జీ.సీ నెట్ ఫెలోషిప్, ఏపీ సెట్, గేట్, అగ్రికల్చర్ నెట్,లాంటి 13 జాతీయ పరీక్షలకు అర్హత సాధిం చాడు. ఈ క్రమంలో ఆరు బెస్ట్ ప్రెజంటేషన్ అవార్డు లు, రెండు యంగ్ సై0టిస్ట్ అవార్డులు అందుకున్నా డు.ఇన్ని డిగ్రీలు మెదడుకు మొలిచినా నిరుద్యోగం అనేది కొన్నేళ్లుగా అతన్ని ఎక్కిరిస్తూనే ఉంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం డోలాస్ నగర్ కి చెందిన బిరుదు రవిబాబు.చాలా నిరుపేద కుటుంబంలో బిరుదు ఆదాం,నాగరత్నం దంప తులకు జన్మించాడు.తండ్రి రిక్షా తొక్కి,చెప్పులు కుట్ట గా, తల్లి గ్రామంలో పలు ఇళ్ళల్లో పాచిపనులు చేసి రవిబాబును చదివించారు. అందుకు రవిబాబు కూడా నిరుపేద కుటుంబం కావ డంతో జీవితంలో ఉన్నత మైన స్థానం పొందాలి అంటే చదువు చాలా అవసరం అనుకున్నాడు. అందుకే ఎంత కష్టమైనా చదువుని కష్టం అను కోకుండా ఇష్టంగా చదివి అన్ని డిగ్రీలు సాధించిన రవిబాబు సరస్వతీ పుత్రుడు అయినా నిరు ద్యోగం వెక్కిరిస్తూనే ఉంది. అత్యంత పేదరికంలో పుట్టిన రవిబాబు ప్రాధమిక విద్య నుండి పీజీ వరకు తన తల్లి పాచి పనులు చేసిన ఇంటి యజమాని ఎర్రబాలెం గ్రామానికి చెందిన నాటి డీ.ఈ.ఓ మెడిచర్ల గౌరినాధ శాస్త్రి, రాజ్యలక్ష్మి దంపతులు తనకు చదువు పై ఉన్న ఆశక్తిని ఆనాడే గ్రహించి రవి ని వారి బిడ్డలా భావించి తన చదువుకు, పుస్తకాలు,ఫీజులకు చాలా వరకు ఆర్ధిక సాయం చేసి ఎంతో చేదోడు, వాదోడుగా ఉన్నా రని రవి తెలిపాడు. ఇక పేద రికంతో ఇంటిలో కరెంట్ లేకపోయినా రాత్రి వేళల్లో చదివిన ఏ కోర్సులకు కూడా కోచింగ్ లు కూడా లేకుండా సొంతం గా వీధి లైట్ల క్రింద కూర్చుని చదువుకున్న మరో అభినవ అంబేద్కర్ లాంటి వాడిగా రవిబాబుని గ్రామస్థులు పిలుస్తారు.
లక్ష్యం ఒక్కటే, ఏ యూనివర్సిటీ అయినా ఫర్వాలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం సాధించి ఆచార్యుడు గా జీవితంలో నిలదొక్కు కోవాలి,అందరిచే ఆచార్యుడు అని పిలి పించుకోవాలి అని పరి తపించి పోతున్నాడు.ఆ లక్ష్యం తోనే 2006 నుండి 2008 లో ఆక్వా టెక్నీషి యన్ గా,మెడికల్ రిప్రజెంటివ్ గా కొన్నాళ్లు ప్రవేట్ ఉద్యోగాలు చేయ డం జరిగింది.అలాగే గతంలో సచివాలయం పరీక్షలలో మత్స్య సహాయకుడిగా రాష్ట్ర స్థాయిలో 5 వ ర్యా0క్ సాధించాడు. మరియు శానిటరీ సెక్రెటరీగా దొరికిన కొలువు ను అసిస్టెంట్ ప్రొఫెసర్ సాధించాలి అనే లక్ష్యం తో వాటికి దూరమై పై చదువు లు చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్ కి కావలసిన అర్హతలు అన్నీ సాధించాడు.2018 లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో రెండు సబ్జెక్ట్ లలో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అప్పుడు ఈ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు కోర్టును ఆశ్రయించడం ద్వారా ప్రభుత్వం ఇంటర్యూలు నిర్వహించ లేదు.అటుగా ఆశలు పెట్టుకున్నా నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా నిరాశ వెంటాడుతుంది. అలాగే దేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు కావాల్సిన అత్యధిక జాతీయస్ధాయి అర్హతలు సాధించినా అతని పట్ల నిరుద్యోగం కనికరం చూపలేదు.రవిబాబు సాధించిన డిగ్రీలకు గుర్తుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో ప్రత్యేక స్థానం లభించింది.డిగ్రీలు ఎన్ని ఉన్నా, రికార్డ్స్ ఎంత గొప్పవయినా తనను నిరు ద్యోగం ఇప్పటికీ వెక్కిరి స్తూనే ఉంది.2010 నుండి రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్, ఆడహక్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గెస్ట్ ఫ్యాకల్టీ, అకడమిక్ కన్సల్టెంట్, పోస్టులకు హాజరైనా ఏ విశ్వ విద్యాలయం కూడా తన ప్రతిభ గుర్తించకపోగా పలు రకాలుగా వివక్ష చూపి తనకంటే అర్హతలు తక్కువగా ఉన్న వారికి, సొంత వ్యక్తులకు అవకాశం కల్పించి తనకు మాత్రం అన్యాయం చేశారని రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.నాడు తన కు జరిగిన అన్యాయా న్ని స్వయంగా నాటి విద్యా శాఖ మంత్రిని కలిసి న్యాయం చేయమని కాళ్ళా, వెళ్ళా పడినా ఉపయోగం లేదు.పైగా తన చాంబర్ కి వెళ్ళి అడిగి నందుకు తన సెక్యూరిటీ తో మెడ మీద చేతులు వేసి నిర్దాక్షిణ్యంగా విద్యా శాఖా మంత్రి గెంటించారని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు రవిబాబు.ఇంతగా చదు వుకొని, ఇన్ని డిగ్రీలు సాధించి, ఉద్యోగం లేని తనను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారని కేవలం వారిని నవ్వించే భఫున్ లా మారింది నా పరిస్థితి అని మానసిక క్షోభ కు గురై ఆత్మహత్య చేసుకోవాలి అనే పరిస్థితి కి వెళ్ళానని కన్నీటి పర్యంతం అయ్యాడు రవి బాబు. మిస్టర్ విశ్వం అని పిలువ బడే ఈ నిరుద్యోగి కొన్నే ళ్లుగా తనను అంటి పెట్టు కున్న నిరుద్యోగ సమస్యను అధిగమించలేక మానసిక క్షోభకు గురై ప్రస్తుతం నిరాశ జీవితం లో ఉన్నాడు.
ఈ ప్రభుత్వాల వల్ల ఉపయోగం ఏమిటి.బాబు వస్తే జాబ్ అని ఓ ప్రభు త్వం, ప్రతి ఏటా వరుస జాబ్ నోటిఫికేషన్స్ అని ఒక ప్రభుత్వం అమలు కాని అజెండాలతో మను గడ సాగిస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో విద్యా ర్హతలు సాధించిన రవి బాబు లాంటి వారి పరిస్థితి ఇలా ఉంటే, కాస్తా,కూస్తా విద్యార్హతలు సాధించిన విద్యార్థుల పరిస్థితులు, ఎలా ఉన్నాయి...?ఇతని నిరుద్యోగ సమస్య తీర్చే వారు ఎవరు...?ఈ సమ స్యకుపరిష్కారం ఎప్పుడు? గద్దెనెక్కిన వారు అక్కడ అన్ని ఉద్యోగాలు కల్పిం చాం,ఇక్కడ ఇన్ని ఉద్యో గాలు కల్పించాం అని చెపుతున్న తరుణంలో లక్ష్యం కోసం ఈ సరస్వతీ పుత్రుడికి కావాల్సిన మరే అర్హతలు అతను సాధిం చాలి...?ఆ క్రీడల్లో ఘన త,ఈ అంశాలలో ఘనత సాధించిన పలు రంగాలలో నిష్ణాతులైన వారికి ప్రభుత్వం లక్షలకు,లక్షలు నగదు, సన్మానాలు,ఆయా కుటుంబానికి ఇంటి స్థలం, చివరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహిస్తున్న తరు ణంలో విద్యారంగంలో రవిబాబు సాధించిన ఘనతకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ,వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటివి గుర్తింపును ఇచ్చినా ఫలితం శూన్యమేనా...?హలో లక్ష్మణ ఉద్యోగం కల్పించండి అని ఎదురు చూస్తున్న రవిబాబు లాంటి నిరుద్యోగులు మన ప్రభు త్వాలు చెపుతున్న నిరు ద్యోగులకు ఉద్యోగాల కల్పన అని చెప్పే గొప్పలు పలికే ప్రగల్భాల మాటలు ఇటువంటి నిరుద్యోగులు రెండు చెవుల్లో పూలు పెట్టుకుని వినాల్సిం దేనా....?వీరి నిరీక్షణకు ఫలితం ఇదేనా...?ఎప్పటికైనా తను సాధించాలి అనుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు ఈ ప్రభుత్వం ద్వారానైనా దక్కుతుంది అని ఈ నిరుద్యోగ వ్యక్తి కోటి ఆశలతో,ఇంకా పూర్తి ఆత్మ విశ్వాసం తో ఎదురు చూస్తున్నాడు. అద్భుత మైన,అపారమైన లక్ష్యం తో లెక్కకు మించి చేత బట్టుకుని ఉన్న డిగ్రీలు ఏనాటికైనా తన లక్ష్యానికి దగ్గర చేస్తాయని ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వం పై పూర్తి నమ్మకం కలిగి ఉన్నా డు.మరి ప్రభుత్వం అతని ఆశలు ఆడియాశలు కాకుండా చేస్తుంది అని కోరుకుందాం.
Story by.. ఈపూరి రాజారత్నం , ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ , మంగళగిరి , 9390062078
No comments:
Post a Comment