తల్లి కన్నీళ్లు తన బిడ్డను రక్షించ లేవు కానీ మనం ఇచ్చే రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది... అని పిలుపునిచ్చిన రక్తదాతలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
చిత్తూర్ జిల్లా శ్రీకాళహష్టి పట్టణములోని యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో ఈ రోజు పట్టణంలోని ఎన్టిఆర్ పార్క్ ప్రక్కన వున్నా నిరాశ్రుయుల వసతి గృహం నందు రక్త దాన శిబిరం ఎర్పాటుచేయడమైనది.
ఈ కార్యక్రమం రుయా బ్లడ్ బ్యాంక్, ఎన్ టిఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారం తో జరుగింది.
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా మాజీ మునిసిపల్ చైర్మన్ మ్యాగీక్లార, న్యాయవాది రాజేశ్వరరావు, విశ్రాంతి ఉద్యోగి స్వర్ణమూర్తి మరియు యువతరం సభ్యులు పాల్గొని కార్యక్రమమును ప్రారంభించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో విజయవంతమునకు సహకరించిన మెప్మా అధికారులకు ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.
యువతరం సభ్యులు
మాట్లాడుతూ....మెటర్నెటీ హాస్పిటల్ వాళ్ళు రక్తం అవసరం వునందున స్వచ్చందంగా రక్షదానం చేసే దాతలకు మా అభినందనలు, అలాగే రక్త దానం అనేది దాదాపుగా ప్రాణ దానానికి సమానం అని తెలిపినారు. రక్తదానం అనేది మానవత్వానికి నిదర్శనం. ఇది సహచర మానవుల పట్ల ప్రేమను, దయను ప్రదర్శించే పవిత్రమైన కార్యక్రమం.
డాక్టర్ మాట్లాడుతూ... మెటర్నేటి హాస్పిటల్ లోని గర్భిణీలు మరియు కరోన తర్వాత చిన్న పిల్లలలు మరియు అనేక వ్యాధి గ్రస్థులకు ఎక్కువ మందికి రక్షణ అవసరం వునందున ఈ రోజు సుమారు చాలా మంది దాతలు ముందుకొచ్చారు. ఇపుడున్న పరిస్థితుల్లో రక్తం చాలా అవసరం ఉందని, ఈ కార్యక్రమం విజయవంతం చేరిన యువతరం వాలంటరీ లు అభినందనలు తెలిపారు
No comments:
Post a Comment