పామాయిల్ సాగుపై రైతులకి అవగాహన కల్పించండి
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికారులకి పిలుపునిచ్చిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
దేశ వ్యాప్తంగా వంటనూనెల కొరతతో మార్కెట్లో పామాయిల్ కి మంచి డిమాండ్ ఉందని కాని వివిధ కారణాలతో రైతులు పామాయిల్ సాగు చేసేందుకు మొగ్గు చూపడం లేదని పామాయిల్ సాగు కోసం ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సబ్సిడీ తదితర కార్యక్రమాల గూర్చి రైతులకి అవగాహన కల్పించి ఆసక్తి పెంపొందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆలాగే రేణిగుంట, ఏర్పేడు మండలాల లోని రైతులు పూర్తిగా బోర్లపై ఆధార పడి వ్యవసాయం చేస్తున్నందున వారికి బోర్ల కింద పండించే అనుకూలమైన పంటల గూర్చి అవగాహన కల్పించాలన్నారు. ఆలాగే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఓజిలి మండలం పున్నెపల్లి గ్రామంలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను త్వరగా మార్చి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
No comments:
Post a Comment