సత్రవాడ ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కుమారుడు బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సత్రవాడ ప్రవీణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరిపారు.శ్రీకాళహస్తి గుడిలో ఆయన పేరు పూజలు చేసి . శ్రీకాళహస్తి అమర జ్యోతి కళ్యాణమండపం ,విశాలాక్షి నగర్ ,నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అవి తీరుస్తూ ప్రజలు ఆశీస్సులు పొందిన ప్రవీణ్ అన్న ఉన్నత శిఖరాలు కి చేరి పేదలకు మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆయన అభిమానులు కోరారు . ఈ కార్యక్రమంలో, మస్తాన్ రెడ్డి, సుందరం రెడ్డి, సుబ్రహ్మణ్యం, విజయ్ ఆచారి మరియు సత్ర వాడ ప్రవీణ్ అన్న యువసేన పాల్గొన్నారు.
No comments:
Post a Comment