దర్గా పీఠాధిపతి అయినా సయ్యద్ అహ్మద్ ను పరామర్శించిన గజల్ శ్రీనివాస్
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం లోని జంలేష ఫిర్ దర్గా ను కుటుంబసభ్యులతో దర్శనం చేసుకొన్న హ్యాట్రిక్ గిన్నీస్ రికార్డు గ్రహీత, ప్రముఖ గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్.
దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ గారి ఆరోగ్యం ఈ మధ్య బాగాలేదని తెలిసిన వెంటనే డాక్టర్ గజల్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా వచ్చి పరామర్శించడం జరిగింది. అనంతరం డాక్టర్ సూచనలు పాటించాలని తనకు తెలిసిన ఒక డాక్టర్ తో ఫోన్లో మాట్లాడి విషయం తెలిపి వారి యొక్క సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. అలాగే ఆ దర్గా స్వామి, అల్లాహ్ యొక్క కృపా కటాక్షములు ఎల్లప్పుడు ఉంటాయని ఆకాంక్షించారు .
మీరు దర్గా మసీదు అభివృద్ధి సేవ కార్యక్రమాలు చురుకుగా చేసినారు కాబట్టి మీకు త్వరలోనే ఆరోగ్యంగా ఉంటారని నేను కూడా అల్లాః ను ప్రార్థిస్తాం అని తెలిపారు. అనంతరం మసీదులో కి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, తదుపరి దర్గా దర్శనం అనంతరం తేనీరు సేవించి తిరుగు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి, సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, ఉరుసు కమిటీ సభ్యులు వి నాగేశ్వర రావు, గరికపాటి రమేష్ బాబు, జంరుద్ బాషా , మొహమ్మద్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment