ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ నెల 23వ తారీకున ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహనరెడ్డి గారు శ్రీకాళహస్తి మండలం, ఇనగలూరులో 126 ఎకరాల స్థలంలో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించ తలపెట్టిన సెజ్ శంఖుస్థాపన కార్యక్రమం మరియు వివిధ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, కలిసి ఇనగలూరులో సభా ప్రాంగణాన్ని పరిశీలించారు ఏర్పాట్ల గూర్చి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయమని మంత్రి ఆదేశించారు.
తదుపరి తిరుపతి విమానశ్రయం పరిసర ప్రాంతంలో ఉత్పత్తిని ప్రారంభించనున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ మరియు వివిధ శాఖలోని పలువురు అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment