MGM హాస్పిటల్స్ సేవలు అభినందనీయం. MLA బొజ్జల సుధీర్ రెడ్డి.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి మాజీ MLA మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారి 76 వ జన్మదిన సందర్బంగా MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరం ను శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో MLA బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మా నాన్న గారి జన్మదిన సందర్బంగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు MGM హాస్పిటల్స్ వారు నిర్వహించిన వైద్య శిబిరంలో దాదాపు 200 మంది ప్రజలు, కార్యకర్తలు పాల్గొని వారి కి సంబందించిన ఆరోగ్య సలహాలను MGM డాక్టర్ లని అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించినందులకు MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ గారికి ధన్యవాదములు తెలిపారు. అలాగే బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ శ్రీకాళహస్తి లో వైద్య రంగంలో ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్న MGM హాస్పిటల్స్ రాబోయే రోజుల్లో మరికొన్ని వైద్య సేవలు అందిస్తూ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందాలని ఆశభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తి కార్యకర్తలు, ప్రజలు, అధికారులు MGM హాస్పిటల్స్ డాక్టర్ లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment