జగనన్నకు ఆర్టీసీ కార్మికులు అందరూ రుణపడి ఉండాలి
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసిన జగనన్నకు ఆర్టీసీ కార్మికులు అందరూ రుణపడి ఉండాలి,THE PTD YSR EMPLOYEES ASSOCIATION తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషకరం.ఆర్టీసీ కార్మికులు నమ్మకానికి బద్దుడనై వారికి సేవ చేస్తానని వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
పిటిడి వైఎస్సార్ ఎంప్లస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాళహస్తి పట్టంలోని ఎస్.ఎస్.కళ్యాణ మండపం నందు నిర్వహించిన తిరుపతి జిల్లా కాన్సిల్ సమావేశనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పిటిడి వైఎస్సార్ ఎంప్లస్ అసోషిష్ జిల్ల మరియు రాష్ట్ర నాయకులుపాల్గొన్నారు.
ముందుగా ఎమ్మెల్యే గారి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు మరియు కుమారుడు ఆకర్ష రెడ్డి బియ్యపు జిల్లా నలుమూలల నుండి వచ్చిన పిటిడి వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులను శాలువా కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,తనను తిరుపతి జిల్లా పిటిడి వైఎస్సార్ ఎంప్లస్ అసోషిష్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్ఆర్టీసీ చేసిన సేవలను మరియు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ కు అందజేసిన పథకాల గురించి ప్రస్తావించారు.ఆర్టీసీ కార్మికుల కుటుంబంలో వెలుగు నింపడం కోసం జగన్ అన్న ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేశారని మీరందరూ జగనన్నకు ఎల్లవేళల ఆశీర్వాదాలు అందజేయాలని కోరారు. మన పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్న కూడా ఇప్పటివరకు వాళ్ళని చేయలేదు, కానీ జగనన్న పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పని మనుషుల్లాగా సేవ చేయడానికి నేను నా బిడ్డలు ఉన్నాము మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా నాకు తెలియజేయండి.శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ కి త్వరలోనే ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో THE PTD YSR EMPLOYEES ASSOCIATION రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, డి.ఎస్.పి రావు, రాష్ట్ర కార్యదర్శి లత రెడ్డి,జిల్లా అధ్యక్షుడు అర్జునయ్య,జిల్లా కార్యదర్శి MTR రెడ్డి,అడిషనల్ సెక్రటరీ నరసింహ యాదవ్, అల్లయ, సూరిబాబు,MS మన్యం, ఏ.సి రాయల్,బాలాజీ,ఆర్ముగం,అంకి రెడ్డి,బిల్లు ప్రసాద్ యాదవ్,mc రాయల్, భాగ్య రాజ్,యుగంధర్ మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment