నిరుపేదల గూడులను తొలగిస్తాం అంటే చూస్తూ ఊరుకోం..సి.పి.ఎం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, June 21, 2022

నిరుపేదల గూడులను తొలగిస్తాం అంటే చూస్తూ ఊరుకోం..సి.పి.ఎం

 నిరుపేదల గూడులను తొలగిస్తాం అంటే చూస్తూ ఊరుకోం..సి.పి.ఎం

 
 

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

గత 20 సంవత్సరాలుగా నివాసముంటున్న గిరిజనుల ఇళ్లను తొలగిస్తాం అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని సి.పి.ఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య అన్నారు. మండలంలోని రాచగున్నెరి పంచాయితీ ఎస్.టి కాలనీలో నివసిస్తున్న శ్రీమంతుల సుబ్రమణ్యం గత 20 సంవత్సరాల క్రితమే కాలని నుంచి వచ్చి సర్వే నెంబర్ 283-1 చెరువు పోరంబోకు స్థలంలో ఒక చిన్నపాటి గుడిసె వేసుకొని దానిలో నివసిస్తూ కుటుంబాన్ని పోషించుకోవడానికి నిమిత్తము ఒక చిన్న టీ అంగడి నడుపుకుంటూ ఈ క్రమంలోనే ఈ.సి.ఎల్ కంపెనీ సిమెంట్ డివిజన్లో పర్మినెంట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే  కంపెనీవారు కంపెనీ అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్న చిన్నపాటి గుడిసెలను తొలగిస్తామని చెప్పటం ఎంతో దుర్మార్గమని ఆయన తెలిపారు. సుబ్రహ్మణ్యం నివసిస్తున్నా ఇంటిని తొలగించకపోతే నిన్ను విధుల నుంచి తొలగిస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ. సి.ఎల్ కంపెనీ వారు గిరిజనుల మీద ఇటువంటి దుర్మార్గమైన పనులకు పూనుకోవటం చాలా బాధాకరమని తెలిపారు. ఇకనైనా ఇటువంటి చర్యలను మానుకోవాలని సి.పి.ఎం పార్టీ ద్వారా కంపెనీ యాజమాన్యం ను హెచ్చరించారు. లేనిపక్షంలో అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ సమస్య మీద పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అలాగే బాధితురాలు శ్రీమంతుల బుజ్జమ్మ మాట్లాడుతూ మేము ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి నివశిస్తున్నామని ఈ చిన్న టీ దుకాణం ద్వారానే తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాం పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నామని తెలిపారు. ఇటువంటి సమయంలో కంపెనీవారు మమ్మల్ని ఇక్కడినుంచి ఖాళీచేయిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తప్ప మాకు మరో మార్గం లేదని మా లాంటి నిరుపేద గిరిజనులను ప్రభుత్వమే ఆదుకోవాలని తమ ఆవేదనను వెల్లగ్రక్కుతున్నారు. ఈ కార్యక్రమంలో రాచగున్నెరి  మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాథం నాయుడు, శ్రీకాళహస్తి సి.పి.ఎం పార్టీ నాయకులు గంధం మనీ, పెనగడం గురవయ్య, వెంకటేష్, బాలకృష్ణ, వెళ్లి వేంద్రం, రాజా, చిన్న బాబు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad