శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ పాల సొసైటీ ప్రమాణస్వీకారోత్సవం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, June 2, 2022

శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ పాల సొసైటీ ప్రమాణస్వీకారోత్సవం

శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ పాల సొసైటీ ప్రమాణస్వీకారోత్సవం 




స్వర్ణముఖిన్యూస్  ,శ్రీకాళహస్తి  :

 శ్రీకాళహస్తి పాలకోవాకు దేశ ఖ్యాతి, పాడి రైతుల అభివృద్ధికి కృషి, పాల సహకార సొసైటీ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా నిలబెడతాం, శ్రీకాళహస్తి పాల సొసైటీ ఉత్పత్తి విక్రయశాలను జిల్లా వారీగా ఏర్పాటు చేస్తాం - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి 


శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ పాల సొసైటీ మహాజన సమావేశం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో గురువారం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ,జనార్దన్ రావు J పవార్ గారు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పాల సొసైటీ నూతన కార్యవర్గము మరియు చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి రైతులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మరియు వారి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు  పాల సొసైటీ చైర్మన్ మరియు సభ్యులను ఘనంగా సన్మానించారు.


శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ మిల్క్ సొసైటీ చైర్మన్ గా చెర్లోపల్లి గ్రామానికి చెందిన మునగాల మధుసూదన్ రావు (వెలమ సామాజికవర్గం) మరియు డైరెక్టర్లుగా A.హరినాథ్ రెడ్డి (రెడ్డి,అక్కుర్తి),R.రమణి(వన్నెరెడ్డి, తొండమనాడు),దామోదర్ రెడ్డి (వన్నెరెడ్డి,సుబ్బానాయుడు కండ్రిగ),రాంచంద్రారెడ్డి (రెడ్డి, ఉరందురు),K. రామ్మూర్తి(SC, కొనతనేరి),P. రామయ్య (యాదవ, పెద్ద కన్నలి),N.మంగమ్మ (వన్నెరెడ్డి,కల్లిపూడి) మరియు B. వెంకటరెడ్డి (రెడ్డి,చల్లపాలెం) ప్రమాణస్వీకారం చేశారు.


అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి కోపరేటివ్ పాల సొసైటీ ఈనాడు ఈ స్థాయిలో ఉందంటే మన మాధవరావు కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు.ఆనాడు వారు నాటిన విత్తనమే నేడు వృక్షంగా మరి రైతులకు ఫలాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చిన రైతులకు మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతులకు మంచి చేయడానికి జగనన్న అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, శ్రీకాళహస్తి పాల సొసైటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, శ్రీకాళహస్తిలో తయారు చేసే పాలకోవా రాష్ట్ర వ్యాప్తంగా క్యాతిగడిచిందని, దీనిని దేశ ఖ్యాతి గడించే విధంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.గత పాలకులు సొసైటీ పైన సరైన అవగాహనతో అభివృద్ధి చేయలేకపోయారు అన్నారు.మనం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు ఐనా బాల సొసైటీని రాజకీయాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష సభ్యులను తొలగించే అవకాశం ఉన్న తొలగించకుండా వదిలేసామన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ను మాధవరావు గారి కుటుంబమే స్థాపించిందని దానికి కూడా చైర్మన్గా నా మిత్రుడు శెట్టి పల్లి సురేష్ ను నియమించామని ఒక సంవత్సరం లోని టౌన్ బ్యాంకు ఎంతో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. అలాగే శ్రీకాళహస్తి దేవస్థానంకి అంజూరు తారక శ్రీనివాసులు గారిని అలాగే పాల సొసైటీకి మధుసూదన్రావు చైర్మన్ గా నియమించామన్నారు. ఈ ముగ్గురు యువ చైర్మన్లు వారి వారి స్థాయిలో ఆలయాన్ని,పాల సొసైటీని,టౌన్ బ్యాంకు ని అభివృద్ధి చేయాలన్నారు.జగన్ అన్న లాగే నేను కూడా సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించామన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు ఇష్టారాజ్యంగా సామాజిక న్యాయం పాటించకుండా పదవులు ఇచ్చారని ఈనాడు పరిస్థితి లేదన్నారు. గతంలో మధుసూదన్రావు ను నామినేషన్ కూడా వేయడానికి అనుమతించ లేదు అన్నారు.నేడు మనం అన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు నామినేషన్ వేయడానికి రాకపోవడం శోచనీయం అన్నారు.పాడి రైతుల ఆర్థిక స్వావలంబనానికి  తోడ్పడే విధంగా పాల సొసైటీని అభివృద్ధి చేయాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గుమ్మడి బాలకృష్ణయ్య, టౌన్ బ్యాంక్ చైర్మన్ శెట్టి పల్లి సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యల కృష్ణారెడ్డి,ఈశ్వర్ రెడ్డి, నాని,బుజ్జి రెడ్డి మరియు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad