బీసీ వెల్ఫేర్ జేఏసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సత్రవాడ ప్రవీణ్ అధ్యక్షతన శ్రీకాళహస్తి పట్టణంలో 2/06/2022 న ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు, అధికార ప్రతినిధి డాక్టర్ డి మస్తానమ్మ పాల్గొని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గా ఎం.ఉమేష్ చంద్ర ను నియమించడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా,బీసీ రిజర్వేషన్లు అన్ని వ్యవస్థలు అన్ని స్థాయిల్లో అమలు జరిగేలా తన వంతు బాధ్యతను బీసీ వెల్ఫేర్ జేఏసి చేపడుతున్నదని ఇలాంటి గొప్ప సంఘంలో పని చేసే అవకాశం వచ్చినందుకు గర్విస్తూ మా వంతు బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తామని ఉమేష్ చంద్ర పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నాగ కిషోర్, కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి, బీసీ నాయకురాలు ఉమా సింగ్ గారు, అడ్వకేట్ తులసీరామ్,పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
No comments:
Post a Comment